సబ్ హెడ్డింగ్ (Excert) Music Director Bheems : సినిమా ఇండస్ట్రీ లో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మన క్యాస్ట్ కూడా మనల్ని ఎదగకుండా చేస్తుందనే విషయం అయితే మరి కొంతమంది విషయం లో తారాస పడుతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లందరికి చుక్కలు చూపిస్తూ ముందుకు సాగుతున్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో… ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన మంచి సాంగ్స్ అన్నీ కూడా ఈయన కంపోజిషన్ లోనే రావడం విశేషం… ఈయన నుంచి ఒక సాంగ్ వస్తుందంటే చాలు యూట్యూబ్లో చాట్ బ్లస్టర్ గా నిలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఈయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదగాల్సిన అవకాశమైతే వచ్చింది. ఇంతకుముందు కూడా ఈయన చాలా మంచి సినిమాలకు మ్యూజిక్ అందించినప్పటికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం కన్వే కాలేకపోయాడు. కారణం ఏంటి అంటే తన క్యాస్ట్ వల్లే ఈయనను తొక్కేస్తున్నారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయని చెబుతున్నప్పటికి ఇన్నర్ గా వాళ్ల క్యాస్ట్ ను దృష్టిలో పెట్టుకునే అతనికి స్టార్ స్టేటస్ అనేది దక్కుతుంది అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఆయన ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా కూడా టాప్ హీరోల సినిమాకు మ్యూజిక్ ని అందించలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు…ఈ సినిమా నుంచి వచ్చినప్రతి పాట హైలెట్ గా నిలుస్తున్నాయి…మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని ఎదగనివ్వరు అనేది ఎప్పటినుంచో వస్తున్న నానుడి…
మరి దానికి అనుకూలంగానే ఇప్పుడు కూడా అదే విషయం మరోసారి ప్రూవ్ అవుతుందనే చెప్పాలి. రీసెంట్ డేస్ లో బలగం, ధమాకా, మ్యాడ్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా గిరిజన బిడ్డగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన దాదాపు 20 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతూనే వస్తున్నాడు.
డైరెక్టర్ ఎన్ శంకర్ రాజశేఖర్ తో చేసిన ‘ఆయుధం ‘ సినిమాలో ‘ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే’ అనే సాంగ్ కూడా రాసింది భీమ్స్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు. మరి అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 20 సంవత్సరాలుగా స్ట్రగుల్ అవుతున్నప్పటికి ఆయన సరైన గుర్తింపైతే రావడం లేదు. ఇక ఇప్పుడిప్పుడే ఆయనకు మంచి గుర్తింపు వస్తుండడం విశేషం. మరి ఇకమీదటైనా పెద్ద హీరోలు అతనికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…