https://oktelugu.com/

Daku Maharaj : డాకు మహారాజ్’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇలా అయితే బ్రేక్ ఈవెన్ కష్టమే!

మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి కేవలం సంక్రాంతి సెలవులు మాత్రమే కలిసొచ్చింది. ఆ తర్వాత మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఈరోజు అయితే అనేక ప్రాంతాలలో అత్యంత దారుణంగా షేర్ వసూళ్లు పడిపోయాయి.

Written By:
  • Vicky
  • , Updated On : January 18, 2025 / 09:31 PM IST
    Daku Maharaj Collections

    Daku Maharaj Collections

    Follow us on

    Daku Maharaj :  నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైన ‘డాకు మహారాజ్’ చిత్రం కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటుంది. మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి కేవలం సంక్రాంతి సెలవులు మాత్రమే కలిసొచ్చింది. ఆ తర్వాత మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఈరోజు అయితే అనేక ప్రాంతాలలో అత్యంత దారుణంగా షేర్ వసూళ్లు పడిపోయాయి. విడుదలై ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాము. ఓవర్సీస్ లో అయితే థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

    నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి ఆరు రోజులకు కలిపి కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయని సమాచారం. కొన్ని మీడియా చానెల్స్ పనిగట్టుకొని ఈ సినిమాకి దాదాపుగా 13 కోట్లు వచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర లో 8 కోట్ల 50 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 6 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్ల 50 లక్షలు, గుంటూరు జిల్లాలో 7 కోట్లు, కృష్ణ జిల్లాలో 5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక లో 3 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. అలా ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని పూర్తి స్థాయిలో అందుకోవాలంటే మరో 15 కోట్లు రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే అంత వసూళ్లు రావడం సాధారణమైన విషయం కాదు. జనవరి 26 వరకు ఈ సినిమా థియేట్రికల్ రన్ పడిపోకుండా బ్యాలన్స్ చేయగలిగితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆడియన్స్ చూపు మొత్తం విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మీదనే ఉంది. ఇప్పటికీ ఈ చిత్రానికి టికెట్స్ దొరకడం కష్టంగా ఉందంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది మీరే అర్థం చేసుకోండి.