Dacoit Movie Release Date: విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో అడవి శేష్(Adivi Sesh). విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలు పెట్టిన అడవి శేష్, క్షణం చిత్రం తో తొలిసారిగా హీరో గా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో, గూఢచారి, మేజర్, ఎవరు, హిట్ – ది సెకండ్ కేస్, ఇలా వరుసగా సూపర్ హిట్ చిత్రాలు చేస్తూ థ్రిల్లర్ జానర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే 2022 వ సంవత్సరం లో విడుదలైన ‘హిట్ : ది సెకండ్ కేస్’ తర్వాత అడవి శేష్ నుండి హీరో గా ఒక్క సినిమా కూడా రాలేదు.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ : ది థర్డ్ కేస్’ చిత్రంలో స్పెషల్ క్యామియో రోల్ లో ఒక పది నిమిషాల పాటు కనిపిస్తాడు కానీ, ఆయన అభిమానులకు అది ఏ మాత్రం సంతృప్తి ని ఇవ్వలేదు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన నుండి ‘డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ’ అనే చిత్రం రాబోతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ని సుప్రియ యార్లగడ్డ నిర్మించింది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ 19 న, ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ద్వారా ఈ విషయాన్నీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా గ్లింప్స్ వీడియో కూడా చాలా కొత్తగా ఉందని, అడవి శేష్ మార్క్ అడుగడుగునా కనిపిస్త్యుండని, కచ్చితంగా మరో భారీ బ్లాక్ బస్టర్ ఆయన ఖాతాలో పడబోతుందని నెటిజెన్స్ చెప్పుకొచ్చారు.
ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి. అయితే అడవి శేష్ మార్చ్ 19 న విడుదల చేస్తూ చాలా పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ తేదీన రావడానికి రామ్ చరణ్, యాష్, పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ కూడా రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ రోజున ‘దురంధర్ 2’ చిత్రం విడుదల కాబోతుంది. ప్రస్తుతం థియేటర్స్ లో రన్నింగ్ లో ఉన్న ‘దురంధర్’ చిత్రం, వెయ్యి కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. రోజురోజుకి ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు మెంటలెక్కిపొయింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ మేనియా ని తట్టుకోలేకనే పెద్ది, టాక్సిక్ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఆ తేదీన రావడానికి భయపడుతున్నాయి. అలాంటిది అడవి శేష్ తన డెకాయిట్ చిత్రాన్ని ధైర్యం గా పోటీ కి దింపడానికి సిద్ధం అయిపోయాడు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.