Dacoit movie 6 Days Worldwide Collections: అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie) కి ఆరంభం లో ఓపెనింగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చినప్పటికీ, వర్కింగ్ డేస్ లో నెమ్మదిగా హోల్డ్ కోల్పోతూ , భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంటుంది. మొన్న వచ్చిన కలెక్షన్స్ తో పోలిస్తే , నిన్న వచ్చిన వసూళ్లు 50 శాతం డ్రాప్ అయ్యాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి సినిమాలకు టాక్ వచ్చినప్పటికీ లాంగ్ రన్ ఉండదు , అలాంటిది డివైడ్ టాక్ వచ్చింది , కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం లో విఫలం అవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు వాళ్ళ అంచనాలే నిజం అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 6 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా 6 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 6 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి కేవలం 85 లక్షల రూపాయిల మాత్రమే వచ్చిందట. నిన్న కేవలం 4 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే నమోదు చేసుకుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. విడుదలకు ముందు ఈ ప్రాంతం లో ఈ చిత్రానికి కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ మీదనే బయ్యర్ ఆశలు పెట్టుకున్నాడు , లేదంటే ఈ ప్రాంతం లో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 6 రోజుల్లో రాగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 6 రోజుల్లో 11 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , హిందీ వెర్షన్ నుండి 3 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 5 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 22 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం మరో 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్ళని రాబట్టాల్సి ఉంటుంది.