Daaku Maharaj : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘డాకు మహారాజ్'(Daaku Maharaj). నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ఈ సినిమా కేవలం నందమూరి అభిమానుల నుండి మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానుల నుండి కూడా మంచి మార్కులు పడ్డాయి. బాలకృష్ణ ని ఈ టైపు హీరోయిజం లో ఇప్పటి వరకు చూడలేదని, రజినీకాంత్ ‘జైలర్’ తరహా హీరోయిజం అంటూ చూసిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచి ఎత్తారు. థియేటర్స్ లో కంటే ఓటీటీ లో విడుదలైనప్పుడు ఈ చిత్రానికి ఇంకా ఎక్కువ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం మన ఇండియన్స్ మాత్రమే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో గొప్పగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా చర్చల్లోకి వచ్చింది.
Also Read : నాకు వచ్చిన కష్టాలు జీవితంలో ఎవరికీ రాకూడదు – సమంత
వివరాల్లోకి వెళ్తే ఒక అరబిక్ దినపత్రిక లో ‘డాకు మహారాజ్’ చిత్రం గురించి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ రాశారు. డాకు మహారాజ్ చిత్రం లో సాంకేతికత చాలా అద్భుతంగా, కొత్తగా ఉందని, బాలయ్య ఇందులో చాలా పవర్ ఫుల్ గా కనిపించాడని, రాబిన్ హుడ్ కాన్సెప్ట్ లో ఇలాంటి తరహా కథలు ఈమధ్య కాలంలో రాలేదని, కచ్చితంగా ఈ చిత్రం ప్రతీ ఒక్కరు చూడదగినది అని ఒక కథనం ప్రచురించారు. దీనిని సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు షేర్ చేస్తూ, సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అరబిక్ దినపత్రిక లో ఒక సినిమా గురించి ఈ విధంగా రాయడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే ఇప్పటి వరకు ఇలాంటి కథనాలు వచ్చాయి. నా తర్వాత నా ఘనత ‘డాకు మహారాజ్’ చిత్రానికే దక్కింది. ఆరు పదుల వయస్సు దాటినా, ఇప్పటికీ మన తెలుగు సినిమా గర్వపడే సినిమాలను బాలయ్య బాబు చేస్తున్నాడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి శ్రీను తో ‘అఖండ 2′(Akhanda 2 Movie) చేస్తున్నాడు. 2021 వ సంవత్సరం లో విడుదలైన ‘అఖండ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు తలరాతే మారిపోయింది. పట్టుకుండల్లా బంగారమే. అసలు ఫ్లాప్ అంటే ఏంటో కూడా తెలియని వాడిగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన జైత్ర యాత్ర కొనసాగుతుంది. బోయపాటి శ్రీను తో ఇది ఆయనకు నాల్గవ సినిమా. బాలయ్య తో ఆయన తీసిన మూడు సినిమాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాలకు అభిమానులు ఎంత అంచనాలు అయితే పెట్టుకుంటారో, అంతకు మించే ఉంటుంది. ‘అఖండ 2 ‘ కూడా అలాగే ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది
Also Read : ఆ మూడు సినిమాలను జపాన్ లో ప్రమోట్ చేస్తున్న రాజమౌళి…కారణం ఏంటంటే..?