https://oktelugu.com/

Daaku Maharaaj: మనిషి కాదు వైల్డ్ యానిమల్…గూస్ బంప్స్ లేపుతున్న డాకు మహారాజ్ నయా ట్రైలర్!

Daaku Maharaaj: అతని శరీరం మీద 16 కత్తి పోట్లు, ఒక బుల్లెట్ గాయం.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే... అతడు మనిషి కాదు, వైల్డ్ యానిమల్, అని బాలకృష్ణను ఉద్దేశిస్తూ విలన్ చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది. విజువల్స్, బాలయ్య లుక్, పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. డాకు మహారాజ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. డాకు మహారాజ్ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 10, 2025 / 08:00 PM IST

    Daaku Maharaaj

    Follow us on

    Daaku Maharaaj: డాకు మహారాజ్ మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. మేకర్స్ ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇచ్చారు. మరో ట్రైలర్ విడుదల చేశారు. డాకు మహారాజ్ నయా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. బాలయ్య మార్క్ మాస్ డైలాగ్స్ గూస్ బంప్స్ రేపుతున్నాయి. డాకు మహారాజ్ నయా ట్రైలర్ పై మీరు కూడా ఓ  లుక్ వేయండి.

    వరుస విజయాలతో జోరుమీదున్నారు బాలకృష్ణ. ఆయన నటించిన గత మూడు చిత్రాలు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అఖండకు ముందు బాలయ్య కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఇక సర్దుకోవడమే అనుకుంటున్న తరుణంలో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డితో హిట్ కొట్టిన బాలకృష్ణ… 2025 సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ విడుదల చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కొల్లి డాకు మహారాజ్ చిత్రాన్ని తెరకెక్కించారు.

    జనవరి 12న డాకు మహారాజ్ విడుదల కానుంది. విడుదలకు కేవలం రెండు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. రాయలసీమ అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుకకు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా రావడం విశేషం. కాగా బాలయ్య తన ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ సైతం ఇచ్చారు. డాకు మహారాజ్ నుండి మరో పవర్ఫుల్ ట్రైలర్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివితో కూడిన ఈ ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచేసింది.

    అతని శరీరం మీద 16 కత్తి పోట్లు, ఒక బుల్లెట్ గాయం.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే… అతడు మనిషి కాదు, వైల్డ్ యానిమల్, అని బాలకృష్ణను ఉద్దేశిస్తూ విలన్ చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది. విజువల్స్, బాలయ్య లుక్, పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. డాకు మహారాజ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. డాకు మహారాజ్ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

    ఇక గేమ్ ఛేంజర్ కి పోటీగా సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ ఎవరనే చర్చ కొనసాగుతుంది. డాకు మహారాజ్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ ప్రధాన విలన్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.