Daku Maharaj Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పుడు కూడా వరుస విజయాలతో తెలుగు సత్తా చాటుకోవడానికి ముందుకు దూసుకెళ్తున్న ఆయన సూపర్ సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు బాబి డైరెక్షన్ లో చేసిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈరోజు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ ప్రాంతంలో కొన్ని ఊర్లను తన ఆధీనంలో పెట్టుకొని ఇల్లిగల్ బిజినెస్ చేస్తున్న తాకుర్ (బాబీ డియోల్) ఫ్యామిలీకి ఉన్న గర్వాన్ని అణిచివేసి పెద్ద ప్రజలకు నీటి కష్టాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో అక్కడొక ప్రాజెక్టు నిర్మించాలనని సీతారాం (బాలకృష్ణ) సివిల్ ఇంజనీర్ అక్కడ అడుగు పెడతాడు. మరి అతని అడుగున అడ్డంకులు వేస్తూ ప్రాజెక్టుని సక్సెస్ ఫుల్ గా చేయనీయకుండా అడ్డుకుంటున్న తకూర్ ఫ్యామిలీ ని ఎదిరించి నిలబడి సీతారాం డాకు మహారాజ్ గా ఎలా ఎదిగాడు. మొత్తానికైతే అక్కడ ప్రాజెక్టును తీసుకొచ్చాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో బాబీ స్టోరీని చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక రొటీన్ సినిమా స్టోరీ అయినప్పటికి దాని స్క్రీన్ ప్లే లో కొంచెం కొత్తదనం అయితే ఆడ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మొత్తాన్ని చాలా ఎంగేజింగ్ గా ముందుకు నడిపించే ప్రయత్నమైతే చేశాడు. ఇక స్టోరీని ఆయన చాలా వరకు కేర్ ఫుల్ గా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇంకా బాలయ్య బాబు క్యారెక్టర్ ను కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మలిచాడు.
ఇక మొత్తానికైతే ఆయన ఏదైతే స్క్రీన్ మీద చూపించాలి అనుకున్నాడో దాన్ని ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక దానివల్లే ఆయనకు చాలావరకు మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇంకా అక్కడక్కడా కొన్ని రొటీన్ సీన్లు కనిపించినప్పటికి సీన్స్ లో ఉన్న ఎమోషన్ ని బుక్ చేసుకొని సినిమా మొత్తాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న బాలయ్య బాబుకి బాబీ రూపంలో ఒక దర్శకుడు దొరకడమే కాకుండా సినిమాని ఆధ్యాంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఎలివేషన్స్ ను ఇస్తూ ముందుకు తీసుకెళ్లాడు.
మరి బాబీ డైరెక్షన్ లో చాలావరకు ఎలివేషన్స్, ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈయన సినిమాలు చాలా మందికి నచ్చుతూ ఉంటాయి. ఈ సినిమా కూడా అదే విధంగా ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పాలి. కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబీ ఎక్కడ కూడా దర్శకుడు యొక్క స్టైల్ ని కాపీ కొట్టకుండా తనకంటూ ఒక ఓన్ స్టైల్ ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సీన్ లో వచ్చే ఎలివేషన్స్, ఎమోషన్ సీన్స్ కి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు హెల్ప్ అయింది. దానివల్ల సినిమా మీద చాలా హైప్ అయితే క్రియేట్ అవ్వడమే కాకుండా సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో బాబీ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సాంగ్స్ ఓకే అనిపించినప్పటికి బ్యా గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉంది.
ఇక బాలయ్య లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాతో ఆయన వరుసగా నాలుగో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి… ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే సీన్స్ అయితే ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషన్ తో బిల్డ్ చేశాడు. సీన్ టు సీన్ నరేషన్ చూపించడంలో బాబీ చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఆయన తాలూకు స్టైల్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నంలో బాబీ చాలా వరకు సక్సెస్ అయితే అయ్యాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే బాలయ్య బాబు ఈ సినిమాలో కూడా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా అద్భుతంగా నటించడమే కాకుండా సినిమా చూసే ప్రేక్షకులందరి చేత కన్నీళ్లు కూడా పెట్టించాడు. అలాంటి ఎమోషన్ ని పలికించడంలో బాలయ్య బాబు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి…
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ ఇద్దరూ కూడా చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు వాళ్ళిద్దరికీ యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు దొరకడం ఎవరికి వారు ఇండివిడ్యాలిటి తీసుకొని చాలా అద్భుతంగా నటించడం వల్ల సినిమా స్టోరీ రన్ అవుతూనే సినిమా మీద మంచి అంచనాలను కూడా పెంచుతూ సినిమా సక్సెస్ లో వీళ్ళు కూడా కీలకపాత్ర వహించారనే చెప్పాలి… ఇక బాబీ డియోల్ తన విలనిజంతో మరోసారి ప్రేక్షకులను భయపెట్టించాడు. అతని ఇంట్రడక్షన్ సీనే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత బాలయ్య బాబును ఢీకొట్టే సీన్లలో చాలా వరకు కృషియల్ పాత్రను పోషిస్తూ వచ్చాడు. ఇక తెలుగు తెరకి మరొక మంచి విలన్ దొరికాడు అనేంతలా ఆ క్యారెక్టర్ ని చేసి మెప్పించాడు… ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి సాంగ్స్ అందించడమే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ గాని ఎమోషన్ సీన్స్ లో గాని తన మార్క్ బిజిఎం ఐతే అందించాడు…ఇక బాలయ్య బాబు తమన్ కాంబోలో వచ్చిన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువ అని మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేశారు…
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా కుదిరింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో వచ్చే బ్లాక్ అయితే చాలా అద్భుతంగా పెట్టారు. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో వస్తున్న ప్రతి సీన్ ని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మలచడంలో సినిమాటోగ్రాఫర్ విజువల్ గా చాలా వరకు హెల్ప్ చేశారనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
బాలయ్య
యాక్షన్ ఎపిసోడ్స్
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
రోటీన్ స్టోరీ
క్లైమాక్స్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5