Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత రెండు వారాలుగా సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటనకు సంబంధించిన కేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్లక్ష్యం వల్లే రేవతి అనే మహిళ చనిపోయింది అంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఘాటుగా వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. అల్లు అర్జున్ ఇంటి పై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు రాళ్లతో దాడి చేయడం, ఆయన ఇంటి గేట్ ముందు దిష్టి బొమ్మ తగలెట్టడం వంటివి చేసారు. ఆరోజు ఇంట్లో అల్లు అర్జున్ లేడు, కేవలం పిల్లలు, భార్య స్నేహారెడ్డి, ఇంట్లోని పనివాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇలా ఒక్కసారిగా ఇంటిపై రాళ్ళ దాడి చేయడంతో కుటుంబ సభ్యులందరు భయపడ్డారు. ఈ దాడి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసినట్టే చేసి పక్క రోజు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా బెయిల్ ఇచ్చి పంపేశారు.
ఇదంతా పక్కన పెడితే తనకి తన కుటుంబానికి రక్షణ కావాలని అల్లు అర్జున్ స్పెషల్ గా కోరడంతో, ఆయన ఇంటికి భద్రత ని ఏర్పాటు చేసారు పోలీసులు. అంతే కాకుండా ఇంటి చుట్టూ తెల్లని పరాధాని రక్షణ కోసం చుట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన హీరోల ఇళ్లకు ఇలా పరదాలు రక్షణ కోసం చుట్టుకునేవారు. మళ్ళీ అలాంటి భయానక పరిస్థితి ఇప్పుడొచ్చింది అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే సంధ్య థియేటర్ ఘటన విషయం లో అల్లు అర్జున్ ని విచారించడానికి హైదరాబాద్ పోలీసులు నేడు చిక్కడిపల్లి కి రావాల్సిందిగా ఆదేశించగా, అల్లు అర్జున్ ని విచారించారు పోలీసులు. అంతే కాకుండా డిసెంబర్ నాల్గవ తేదీన థియేటర్ లోపల ఏమి జరిగిందో సీన్ రీ క్రియేట్ చేయడానికి మరోసారి అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ కి తీసుకెళ్లారు.
ఇదంతా చూసిన ఆయన అభిమానులు, నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందిన ఒక పాన్ ఇండియన్ స్టార్ ని, అది కూడా A11 లో ఉన్న ముద్దాయిని, చీటికీ మాటికీ పోలీస్ స్టేషన్ కి పిలిచి హైదరాబాద్ మొత్తం తిప్పుతున్నారు అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు అల్లు అర్జున్ విషయం లో కానీ, సంధ్య థియేటర్ ఘటన గురించి కానీ మాట్లాడరాదని చాలా బలమైన ఆదేశాలు జారీ చేసాడు. అంతే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం పై మండిపడిన పోలీసులు, ఆయన బెయిల్ ని రద్దు చేయాల్సిందిగా కోర్టు ని ఆశ్రయించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.