https://oktelugu.com/

మెగాస్టార్ ను దాటలేకపోతున్నా ఇప్పటి స్టార్స్ !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతుండటంతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దర్శకులు కూడా ఆయన కోసం కొత్త కథలను సిద్దం చేసుకొని స్టోరీ వినిపించడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. అయితే మెగాస్టార్ చేసిన ‘ఖైదీ నెం.150’, ‘సైరా’ సినిమాలను చరణ్ స్థాపించిన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లోనే నిర్మించారు. ఇప్పుడు చేస్తోన్న ఆచార్యను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లోనే నిర్మిస్తున్నారు. కానీ ‘సైరా’కి నష్టాలు రావడంతో ఇక సొంత బ్యానర్ […]

Written By:
  • admin
  • , Updated On : October 16, 2020 / 06:02 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతుండటంతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దర్శకులు కూడా ఆయన కోసం కొత్త కథలను సిద్దం చేసుకొని స్టోరీ వినిపించడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. అయితే మెగాస్టార్ చేసిన ‘ఖైదీ నెం.150’, ‘సైరా’ సినిమాలను చరణ్ స్థాపించిన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లోనే నిర్మించారు. ఇప్పుడు చేస్తోన్న ఆచార్యను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లోనే నిర్మిస్తున్నారు. కానీ ‘సైరా’కి నష్టాలు రావడంతో ఇక సొంత బ్యానర్ లో సినిమాలు చేయాలనే ఆలోచనను ప్రస్తుతానికి చరణ్ పక్కన పెట్టేశాడు. అందుకే మెగాస్టార్ ప్రస్తుతం ప్లాన్ చేస్తోన్న సినిమాలన్నీ బయట బ్యానర్స్ లోనే చేస్తున్నాడు.

    Also Read: బాలయ్యకి మంచి హీరోయినే దొరికింది !

    మరి బయట బ్యానర్స్ లో సినిమా చేసినందుకు మెగాస్టార్ ఎంత తీసుకుంటున్నారు ? మార్కెట్ పరంగా మెగాస్టార్ రేంజ్ ఇంకా అలాగే ఉంది కాబట్టి.. ఇప్పటి స్టార్ హీరోలలంతా రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. కానీ అక్కడ మెగాస్టార్ కదా… అందుకే అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మెగాస్టార్ ఒక్కో సినిమాకి రూ.55 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన చేస్తోన్న మొత్తం మూడు సినిమాలకుగానూ రూ.165 కోట్ల రెమ్యూనరేషన్ ను అందుకోబోతున్నారట. నిజానికి 165 కోట్లు అంటే ఒక పాన్ ఇండియా సినిమాని నిర్మించవచ్చు. ఏమైనా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇప్పటి స్టార్స్ మెగాస్టార్ ను దాటలేకపోతున్నారు.

    Also Read: వైరల్ అవుతోన్న ‘సుమ’ వీడియో !

    అన్నట్టు మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్కో సినిమాకి ప్రస్తుతం 50 కోట్ల వరకూ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ 2021లో మొత్తం మూడు సినిమాలను పూర్తి చేసి.. 2021లోనే ఆ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్, ఈ సినిమా పూర్తయిన తరువాత ముందుగా తమిళ ‘వేదాళం’ రీమేక్ ను మొదలుపెడతారు. ఈ సినిమాను ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత వి.వి.వినాయక్ దర్శకతంలో ‘లూసిఫర్’ రీమేక్ ను స్టార్ట్ చేస్తారట. ఇక ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నారు. అలాగే డైరెక్టర్ బాబీతో కూడా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు మెగాస్టార్.