Lokesh Kanagaraj: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ లలో లోకేష్ కనకరాజు ఒకరు…ఈయన తీసిన మా నగరం అనే సినిమాతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తమిళ్ సూపర్ స్టార్ అయిన కమలహాసన్ ని హీరోగా పెట్టి ఆయన చేసిన విక్రమ్ సినిమాతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ గా మంచి గుర్తింపు అయితే లభించింది.
ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో విజయ్ తో లియో సినిమా చేశాడు. ఇక ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది అయితే విక్రమ్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో లియో సినిమా ఆ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది.ఇక దాంతో చాలామంది లోకేష్ కనకరాజు పని అయిపోయింది అందుకే లియో సినిమా స్టొరీ ఏమీ లేకుండా ఏదో తీశాము అంటే తీశాము అన్నట్టుగా తీశాడు తప్ప ఆయన రేంజ్ సినిమా అది కాదని ఇలాగే సినిమాలు చేసుకుంటు వెళ్తే షెడ్డు కి వెళ్ళడం పక్క అంటూ చాలామంది ట్రేడ్ పండితులు సైతం లోకేష్ కనకరాజును విమర్శిస్తున్నారు…
ఇక ఇలాంటి క్రమం లో ఒక సూపర్ డూపర్ హిట్టు తర్వాత ఆయన చేయాల్సిన సినిమా లియో కాదు అంతకుమించి సినిమా చేయాల్సి ఉండేది. వాటిని పట్టించుకోకుండా ఆయన లియో అనే ఒక చెత్త కథతో సినిమా చేసి విక్రమ్ సినిమాతో సంపాదించుకున్న క్రేజ్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు… ఇక మాట్లాడితే లోకేష్ యూనివర్సిటీ అంటాడు తప్ప ఆయన సినిమాల్లో కొత్తదనాన్ని పెద్దగా చూపించలేక పోతున్నాడు అంటూ ట్రేడ్ పండితులు సైతం లోకేష్ పైన తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తున్నారు…
ఇక ఇప్పుడూ రజనీకాంత్ తో మరో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఇండస్ట్రీలో కొనసాగుతాడు లేకపోతే మాత్రం తొందరల్లోనే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఒక సినిమా సక్సెస్ ఇచ్చింది అంటే ఆ సక్సెస్ ని నిలబెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుంది అంతేకానీ ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తాము అంటే ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగలేము అందుకని లోకేష్ మంచి సినిమాలు చేస్తే బాగుంటుందని తన ఫాన్స్ తో పాటు సినీ విమర్శకులు సైతం అతనికి తెలియజేస్తున్నారు…