అయితే, ఈ కరోనా నేపథ్యంలో ఆ లెంగ్త్ కూడా జనం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఎక్కువసేపు థియేటర్ లో కూర్చునే ఓపిక జనంలో తగ్గుతూ వస్తోంది. పెద్ద స్టార్ లు అయినా, చిన్నాచితకా హీరోలు అయినా అందరి మొహాలు గంటలు తరబడి చూడలేం అంటున్నారు.
అసలు సినిమాలకు నిడివి తక్కువ ఉన్నా పర్వాలేదు అనే అభిప్రాయం బలపడింది. ముఖ్యంగా చిన్న చిత్రాల కథనం సూటిగా, సుత్తి లేకుండా ఉండాలి, అవసరం అయితే మ్యాటర్ ఎక్కువ లేకపోయినా జనం ఆదరిస్తారు గానీ, అనవసరమైన మ్యాటర్ ఉంటే మాత్రం ఆ సినిమాని డిజాస్టర్ చేస్తున్నారు.
అందుకే ‘డియర్ మేఘ’ ( Dear Megha) అనే చిన్న సినిమా విషయంలో దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా ఎక్కువ లెంగ్త్ లేకుండా చాలా వరకు సీన్స్ ను కత్తిరించి పారేశారు. కేవలం 2 గంటల 5 నిమిషాలు మాత్రమే సినిమా ఉండేలా చూసుకున్నారు. ఎలాగూ తక్కువ నిడివి కాబట్టి, బోర్ ఫీల్ అవకాశం తక్కువ.
అప్పుడు పాజిటివ్ టాక్ వస్తోంది అనేది మేకర్స్ అభిప్రాయం. ఇక మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎల్లుండు రిలీజ్ కాబోతుంది.