Criminals In Bigg Boss: బిగ్ బాస్.. బుల్లితెరపై దీనంత వినోదాన్ని పంచే షో మరొకటి లేదు. ఈ రియాలిటీ షో ప్రస్తుతానికి అన్ని భాషల్లోనూ నంబర్ 1 స్థానంలో ఉంది. అయితే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు అంతా కూడా వివాదాస్పద వ్యక్తులే అయ్యి ఉంటారు. ఎక్కువమంది సినీ రంగం నుంచి ఉన్నా అప్పుడప్పుడూ రాజకీయాల్లోని వివాదాస్పద వ్యక్తులను ఇందులోకి పంపిస్తుంటారు. అలా నేరచరిత కలిగిన సినీ రాజకీయ ప్రముఖులు బిగ్ బాస్ లో పాల్గొంటున్నారు. వారు ఎవరు? వారిపై కేసులు ఎన్ని ఉన్నాయన్న దానిపై స్పెషల్ ఫోకస్.

వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ అభిమానులకు.. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు కావాల్సిన వివాదాలను సృష్టిస్తుంటుంది. ప్రతి సీజన్‌లో వివిధ రంగాలకు చెందిన వివిధ రకాల పోటీదారులు ఇంట్లోకి ప్రవేశిస్తారు. అయితే కొన్ని సీజన్లలో నేర నేపథ్యం ఉన్న కొంతమంది క్రిమినల్స్ ప్రవేశం కూడా జరిగింది. ఈ సంవత్సరం సాజిద్ ఖాన్ బిగ్ బాస్ 16 హౌస్‌లోకి ప్రవేశించడం అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకులు కార్నర్ చేయడానికి కారణమైంది. గతంలో రాహుల్ మహాజన్, మోనికా బేడీలు బిగ్ బా హౌస్‌లో పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. వారు కూడా నేరాల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లినవారే. ఇప్పుడు సాజిద్ పై కూడా అలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి..
–సాజిద్ ఖాన్
బిగ్ బాస్ 16 హిందీ సీజన్ లో సాజిద్ ఖాన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి షోలో చేరడంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. #MeToo ఉద్యమం ఫలితంగా 2018లో సాజిద్ వార్తల్లో నిలిచాడు. ఈ దర్శకుడిపై పలువురు మహిళా తారలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అతను హౌస్‌ఫుల్ 4 సినిమా నుంచి కూడా ఇవే ఆరోపణలతో దర్శకత్వం చేయలేక నిష్క్రమించాడు. సాజిద్ అప్పటి నుండి తక్కువ ప్రొఫైల్‌ను కొనసాగించాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ 16తో తిరిగి వచ్చాడు. సాజిద్‌ను కంటెస్టెంట్‌లలో ఒకరిగా అనుమతించడం పెనుదుమారం రేపింది.

-సీమా పరిహార్
సీమా పరిహార్ మాజీ బందిపోటు.. రాజకీయవేత్తగా ఎదిగారు. మాజీ బందిపోటు ఫూలన్ దేవి తనకు స్ఫూర్తి అని సీమా చెబుతుంటుంది. ఈమెది నేరచరిత్రనే.. జైలుకు కూడా వెళ్లివచ్చారు. క్రిమినల్ మెంటాల్టీ గలదని చెబుతుంటారు.. వుండెడ్ ద బాండిట్ క్వీన్ అనే సినిమాలో సీమ నటించింది. ఆమె 2010లో బిగ్ బాస్ 4లో పోటీదారుగా ఉన్నారు. 76వ రోజున ఎలిమినేట్ అయ్యారు.

-సంపత్ పాల్
ఆమె గులాబీ గ్యాంగ్ అనే దోపిడీ మహిళా బృందానికి నాయకురాలు. సంపత్ తన ముఠాతో కలిసి చాలా మంది ప్రభుత్వ అధికారులను, గృహ హింసకు పాల్పడిన పురుషులను చావబాదారు. రెండుసార్లు జైలుకు వెళ్లారు. ఈ సమాజంలో మహిళలపై సామాజిక అన్యాయాన్ని రూపుమాపడానికి ఆమె తన ప్రయత్నాలను కొనసాగించింది. సంపత్ యొక్క గులాబ్ గ్యాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసింది. గులాబ్ గ్యాంగ్ గురించి ఫ్రాన్స్‌లో కూడా ఒక అధ్యాయం ప్రారంభించబడింది. మాధురీ దీక్షిత్ , జూహీ చావ్లా జంటగా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన చిత్రాన్ని ఈమెనే నిర్మించింది. ఆమె బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న క్రిమినల్ గా పేరుగాంచింది.

ఇలా బిగ్ బాస్ లోనూ క్రిమినల్స్ పాల్గొన్నారు. ఇప్పటివరకూ హిందీలో మాత్రమే వీరికి చోటు దక్కింది. మరి మన తెలుగునాట ఇంకా ప్రారంభం కాలేదు. మున్ముందు ఆ ముచ్చట కూడా ఇక్కడ తీరే అవకాశం ఉంది.