https://oktelugu.com/

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలిపిన క్రికెటర్లు…

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త సినీ ప్రేక్షకులను విషాదంలోకి నెట్టింది. ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఇంట్లోని జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసే ప్రయత్నం చేసిన ఫలితం […]

Written By: , Updated On : October 29, 2021 / 06:31 PM IST
Follow us on

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త సినీ ప్రేక్షకులను విషాదంలోకి నెట్టింది. ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఇంట్లోని జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు.

cricketers condolence to puneeth raj kumar on twitter

వైద్యులు చికిత్స చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండాపోయింది. వైద్యులు పునీత్ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.. కానీ పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ చనిపోయిన ఆయన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడనున్నాయి. పునీత్ రాజ్ కుమార్ ఆయన కళ్ళను దానం చేశారు. పునీత్ కళ్లను దానం చేయనున్నట్టు ఆయన కుటుంబీకులు తెలిపారు. గతంలో పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను మరొకరి కోసం దానం చేశారు.

నడి వయసులోనే అతడు కన్ను మూశాడని తెలియడంతో… అతడితో తమ అనుబంధాన్ని చాలామంది క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు. పునీత్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌, సురేశ్ రైనా, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అనిల్‌ కుంబ్లే,  వెంకటేశ్‌ ప్రసాద్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, దేవదత్‌ పడిక్కల్‌, పలువురు క్రికెటర్లు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి నటుడే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటాడు. కాగా క్రికెటర్ల తోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. పునీత్ చనిపోయిన ఆయన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడనున్నాయి. పునీత్ రాజ్ కుమార్ ఆయన కళ్ళను దానం చేశారు.