Project K: ప్రభాస్ కెరీర్లో మరో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీ కథ, కథనం, జోనర్ పై అనేక సందేహాలు, ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ మూవీ. టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. హీరో విలన్ మధ్య సంఘర్షణలో భాగంగా కాలాలలో ప్రయాణం చేస్తారట. అలాగే ప్రాజెక్ట్ కే టైటిల్ అర్థం ఏమిటో కూడా సస్పెన్సు. కే అంటే కృష్ణ. ప్రాజెక్ట్ కృష్ణ అని మీనింగ్ అనే ప్రచారం జరుగుతుంది.
ఈ సందేహాలకు నేడు సాయంత్రం చెక్ పెట్టనున్నారు. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే( what is project k?) రివీల్ చేయబోతున్నారు. సాయంత్రం 7:10 నిమిషాలకు ప్రాజెక్ట్ కే అంటే ఏమిటో తెలియజేస్తాం అంటూ చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. దీంతో నేడు సస్పెన్సు కి తెరపడనుందని చిత్ర వర్గాలు, అభిమానులు భావిస్తున్నారు.
ప్రాజెక్ట్ కే చిత్రానికి నాగ అశ్విన్ దర్శకుడు. సినిమా మేకింగ్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. ప్రాజెక్ట్ కే మూవీలో ఉపయోగించే వస్తువులు, వాహనాలు స్క్రాచ్ అనే టెక్నాలజీలో రూపొందిస్తున్నారు. ఒక టైర్ తయారు చేసేందుకు చిత్ర యూనిట్ పడ్డ కష్టాన్ని ఆ మధ్య ప్రోమోలో చూపించారు. ఇక కమల్ హాసన్ జాయిన్ కావడంతో మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరాయి.
ప్రాజెక్ట్ కే మూవీలో కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. రెండు భాగాలుగా విడుదల కానున్న ప్రాజెక్ట్ కే లో సెకండ్ పార్ట్ లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ప్రాజెక్ట్ కే పార్ట్ 1కి గాను ఆయన రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్. ఆమె ప్రీ లుక్ విడుదల చేయగా ఆకట్టుకుంది. దిశా పటాని కీలక రోల్ చేస్తుంది.
అలాగే అమితాబ్ బచ్చన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనది కూడా కథలో కీలకమైన పాత్ర. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇది పాన్ వరల్డ్ మూవీ అని చెప్పడం విశేషం.
What is #ProjectK… The world wants to know!
Come Kloser…
First drop today at 7:10 PM (IST)/ 6:40 AM (PST).#WhatisProjectK #Prabhas pic.twitter.com/9eX5vJutry
— Prabhas FC (@PrabhasRaju) July 8, 2023