https://oktelugu.com/

Kalki Part 2: కల్కి 2 నుండి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్… మీరు అనుకున్న దానికి ముందే థియేటర్స్ లోకి!

కల్కి 2829 AD వసూళ్ల వర్షం కురిపించింది. ప్రభాస్ కెరీర్లో ఓ భారీ హిట్ నమోదైంది. ఈ క్రమంలో కల్కి పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. కల్కి 2 విడుదల తేదీపై ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ బయటకు వచ్చింది. అనుకున్న సమయం కంటే కల్కి 2 థియేటర్స్ లోకి రానుందట.

Written By:
  • S Reddy
  • , Updated On : August 6, 2024 / 01:55 PM IST

    Kalki Part 2

    Follow us on

    Kalki Part 2:  రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ కల్కి 2898 ఏడీ ‘ బ్లాక్ బస్టర్ హిట్. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం రికార్డులు కొల్లగొడుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1100 కోట్లు వసూళ్లు సాధించింది. కల్కి మూవీ భారీ విజయం సాధించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే తాజాగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి 2898 ఏడీ ఎండింగ్ ట్విస్ట్ తో పార్ట్ 2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

    కల్కి రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుకున్నదాని కంటే ముందే కల్కి 2898 ఏడీ మూవీ రాబోతుందట. ఇప్పటికే సీక్వెల్ కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేశారట. పార్ట్ 2 కోసం ఇప్పటివరకు 60 శాతం షూటింగ్ కూడా పూర్తయింది అని మేకర్స్ తెలియజేసారు. కల్కి పార్ట్ 1 కోసం దర్శకుడు దాదాపు నాలుగేళ్లు సమయం తీసుకున్నాడు. 2020లో సినిమా ఎనౌన్స్ చేశారు. 2024 జూన్ 27న మూవీ రిలీజ్ చేశారు.

    అయితే ఈసారి అంత సమయం తీసుకోమని .. చాలా త్వరగానే పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని నాగ్ అశ్విన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కల్కి పార్ట్ 2 కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మొదటి భాగం షూటింగ్ జరుగుతుండగా .. రెండో భాగానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. దాదాపు 20 రోజుల షూటింగ్ పూర్తయింది. ఇంకా చాలా ఆలోచించి చేయాల్సిన పని ఉంది.

    ఈ సినిమా మొదటి భాగానికి పట్టినంత సమయం తీసుకోదు అని నాగ్ అశ్విన్ తెలిపారు. కల్కి పార్ట్ 1 కోసం నాలుగేళ్ల సమయం పట్టింది. రెండో భాగానికి ఇంకెంత టైం పడుతుందో అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన మాటలకు ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి. అనుకున్నదాని కంటే ముందే కల్కి రాబోతుందని ఫుల్ ఖుషి అవుతున్నారు.

    మహాభారతం ఆధారంగా నాగ్ అశ్విన్ కథను రూపొందించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనిపించుకున్నాయి. అయితే సినిమా రిలీజ్ అవ్వకముందు కల్కి ప్రభాస్ అని అంతా భావించారు. కానీ ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించాడు. దీంతో పార్ట్ 2 లో కల్కి గా ఎవరు కనిపించనున్నారు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక అశ్వథామ గా అమితాబ్ అద్భుతంగా నటించారు.

    కమల్ హాసన్ విశ్వరూపం పార్ట్ 2 లో ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. రాజమౌళి, ఆర్జీవీ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కేమియో రోల్స్ లో అలరించారు. మరి కథ మొత్తం పార్ట్ 2లోనే ఉందట. నాగ్ అశ్విన్ మరిన్ని అద్భుతాలు చేయనున్నాడు.