https://oktelugu.com/

NTR- Koratala Siva Movie: ఎన్టీఆర్ సినిమా పై క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కి ఇది పండగే

NTR- Koratala Siva Movie: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ తన తర్వాత సినిమాని ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి షురూ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని, చాలా స్టైలిష్‌గా ఉంటుందని, పైగా ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఫ్యాన్స్ కి ఇది పండగే. ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. […]

Written By:
  • Shiva
  • , Updated On : July 25, 2022 / 05:04 PM IST
    Follow us on

    NTR- Koratala Siva Movie: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ తన తర్వాత సినిమాని ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి షురూ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని, చాలా స్టైలిష్‌గా ఉంటుందని, పైగా ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఫ్యాన్స్ కి ఇది పండగే.

    NTR- Koratala Siva Movie

    ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. ఫలానా హీరోయిన్ అంటూ రోజుకొక హీరోయిన్ పేరు వినిపించేది. ఇంతకీ, ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తోందో క్లారిటీ వచ్చింది. హీరోయిన్ అనన్య పాండేను ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అనన్య పాండే తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట.

    Also Read: Rajinikanth Income Tax Award: రజినీకాంత్ – అక్షయ్ కు అవార్డ్స్..  మరి తెలుగు  హీరోల పరిస్థితి ఏమిటి ?

    అనన్య పాండేకి ఎన్టీఆర్ కి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయట. ఇక ఆచార్య ప్లాప్ దెబ్బతో ఈ సినిమా విషయంలోనైనా అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కొరటాల పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంతకీ మరో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అంటే.. క్రేజీ హీరోయిన్ సాయిప‌ల్ల‌విను అనుకుంటున్నారు.

    NTR- Koratala Siva Movie

    సాయి ప‌ల్ల‌వి మంచి నటి. ఆమె ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే.. ఇక స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. అందుకే, సాయి పల్లవిని కొరటాల ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి.

    గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు. మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ పాయింట్ ను చెప్పబోతున్నాడు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    Also Read:Thank You Movie Collections: ‘థాంక్యూ’ 4 డేస్ కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

    Tags