https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ నుండి క్రేజీ అప్ డేట్ !

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ నుండి రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ జులై 15న ఉదయం 11 గంటలకు ఒక మేకింగ్ వీడియో రాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. పోస్టర్ ను బట్టి, మేకింగ్ వీడియో కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఇటీవల ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశారు. రామ్ […]

Written By:
  • admin
  • , Updated On : July 11, 2021 / 11:43 AM IST
    Follow us on

    క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ నుండి రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ జులై 15న ఉదయం 11 గంటలకు ఒక మేకింగ్ వీడియో రాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. పోస్టర్ ను బట్టి, మేకింగ్ వీడియో కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది.

    ఇక ఇటీవల ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ పై కీలక సీన్స్ ను షూట్ చేశారు. ఒకపక్క ఈ సినిమా ఇంకా షూటింగ్ లోనే ఉన్నా.. మరోపక్క ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా భారీ బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ సినిమా ‘నార్త్ థియేట్రికల్’ హక్కులను సొంతం చేసుకన్న సంగతి తెలిసిందే.

    అలాగే మిగతా అన్ని భాషల ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను కూడా ‘పెన్ స్టూడియోస్’ వారే కొనుక్కున్నారు. రికార్డ్ రేంజ్ లో భారీ మొత్తాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ కి ఇచ్చింది పెన్ స్టూడియోస్ సంస్థ. మొదటిసారి ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తుండటం, పైగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా మంచి బజ్ ఉంది.

    అన్నిటికీ మించి నేషనల్ రేంజ్ లో గొప్ప విజువల్ డైరెక్టర్ గా రాజమౌళికి గొప్ప పేరు రావడం, ఆ పేరుతో పాటు తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని రాజమౌళికి క్రియేట్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ సినిమాకి మార్కెట్ కూడా అట్టహాసంగా జరుగుతుంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.