Pawan kalyan- Harish Shankar Movie: పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. పైగా చేసిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఈ రెండూ కూడా రీమేక్ సినిమాలే అయినా బంపర్ హిట్ కొట్టాయి. దీంతో పవన్ కళ్యాన్ ఫుల్ జోష్ లో తాను ఒప్పుకున్న మిగతా సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో కంటే చాలా వేగంగా సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోయే భవదీయుడు భగత్ సింగ్ మూవీ గురించి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవన్. ఈ సినిమాను క్రిష్ దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.
Also Read: Ghani Movie Review: రివ్యూ : గని
ఒక నెలలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాబోతుంది. ఈ క్రమంలోనే భవదీయుడు భగత్ సింగ్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ వారు, డైరెక్టర్ హరీష్ శంకర్ కలిసి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయనతో చర్చించిన అనంతరం.. మరో నెల రోజుల తర్వాత భగత్ సింగ్ మూవీ షూటింగులో పవన్ పాల్గొననున్నట్లు చెప్పారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎందుకు ఎదిగాడు అనే అంశాలను చూపించబోతున్నారు. ఈ సినిమాను పవన్ ప్రస్తుత రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తీయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని యాక్షన్, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో ఆమె చేసే మూడో సినిమా ఇది.
Also Read:IPL 2022: కొత్త జట్ల చేతిలో టాప్ జట్లకు పరాజయాలు.. ఢిల్లీని ఓడించిన ఆ ఒక్కడు..