Pooja Hegde: పూజా హెగ్డే టైం అసలేం బాగోలేదు. డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ ఇచ్చి మేకర్స్ ని భయపెట్టింది. గోల్డెన్ హీరోయిన్ కాస్తా ఐరన్ లెగ్ గా మారిపోయింది. వరుస ప్లాపులతో డీలా పడింది. పూజా అంటేనే మేకర్స్ భయపడుతున్నారు. ఆమెను హీరోయిన్ గా ఎంచుకునేందుకు ఇష్టపడటం లేదు. ఈ మధ్య కాలంలో పూజా చేతి నుండి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ జారిపోయాయి. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నారు. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా మొదలైన జనగణమనలో పూజా హెగ్డే హీరోయిన్.
జనగణమన ప్రాజెక్ట్ నుండి నిర్మాతలు తప్పుకున్నారు. జనగణమన ఆగిపోగా పూజా హెగ్డే కి భారీ దెబ్బపడింది. ఆ ప్రాజెక్ట్ రద్దు కావడం వలన పూజాకు రూ. 5 కోట్లు నష్టం వచ్చినట్లు సమాచారం. ఒక షెడ్యూల్ పూర్తి అయ్యాక సినిమా ఆగిపోయింది. రాధే శ్యామ్ తో మొదలైన బ్యాడ్ టైం కొనసాగుతుంది. ఆమె నటించిన ఆచార్య, బీస్ట్, సర్కస్ వరుసగా బోల్తా కొట్టాయి. ఎఫ్ 3 మూవీలో స్పెషల్ సాంగ్ చేయగా ఆ చిత్రం కూడా అటకెక్కింది.
ఆమె లేటెస్ట్ రిలీజ్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పెద్ద షాక్. సల్మాన్ ఖాన్ పరువు తీసిన ఈ చిత్రం, డిజాస్టర్ ఖాతాలో చేరింది. సల్మాన్ కి కలిసొచ్చిన పండుగ రంజాన్ కి విడుదల చేసినా పూజా లెగ్ పవర్ సినిమాను డిజాస్టర్ చేసింది. ఇక పూజా ఆశలన్నీ ఎస్ఎస్ఎంబి 28 మీదే. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మహేష్ చిత్రంతో కమ్ బ్యాక్ కావాలనుకుంటుంది. నిజానికి పూజా కెరీర్ నిలబెట్టింది త్రివిక్రమే. ఫేడ్ అవుట్ దశలో ఉన్న ఆమెకు ఎన్టీఆర్ వంటి స్టార్ పక్కన ఛాన్స్ ఇచ్చాడు.
అరవింద సమేత వీరరాఘవ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ నెక్స్ట్ అల వైకుంఠపురం లో తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు పూజను స్టార్ చేశాయి. సినిమాకు నాలుగైదు కోట్లు తీసుకునే రేంజ్ కి వెళ్ళింది. పూజా-త్రివిక్రమ్ కెరీర్లో ఎస్ఎస్ఎంబి 28 హ్యాట్రిక్ మూవీ. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. మూడు నెలల నిరవధికంగా ప్లాన్ చేశారట. గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడుతో పాటు ఒకటి రెండు పరిగణలో ఉన్నాయట. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోతో పూజా సెగలు రేపుతోంది.
View this post on Instagram