Rashmika Mandanna: చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ప్రముఖ హీరోయిన్ రష్మిక మరియు హీరో విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారని. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలని అటు రష్మిక ఇటు విజయ్ దేవరకొండ అనేక సందర్భాలలో ఖండించారు.
కానీ రీసెంట్ గా జంట కలిసి గోవాకి, మాల్దీవ్స్ కి ఇలా ముఖ్యమైన ప్రాంతాలకు హాలిడే ట్రిప్స్ కి వెళ్తుండడం వంటివి గమనించిన తర్వాత కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుందనే విషయం అందరికీ అర్థం అయ్యింది. రీసెంట్ గా కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో ఉంటూ ఫ్యాన్స్ తో లైవ్ చాట్ చెయ్యడం తో ఆమె ఆధారాలతో సహా దొరికిపోయింది.ఇప్పుడు రీసెంట్ గా లైవ్ లో మరో ఆధారం తో అడ్డంగా దొరికిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన ‘బేబీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా పాల్గొంది రష్మిక. ఈ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ అనే పాటని లాంచ్ చేసింది రష్మిక.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె స్పీచ్ ఇవ్వడానికి మైక్ అందుకుందో, ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది.
ఫ్యాన్స్ అందరూ ‘వదిన వదిన’ అంటూ నినాదాలు చెయ్యడం ప్రారంభించారు. రష్మిక ఆ నినాదాలు విని తెగ మురిసిపోయింది.ఇది కచ్చితంగా అర్థాంగీకారమే అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ఈ జంట అధికారికంగా ఎప్పుడు ప్రకటించబోతుందో చూడాలి. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ తో ‘పుష్ప 2 ‘ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా పలు హిందీ సినిమాల్లో కూడా ఆమె నటిస్తుంది.