Homeఎంటర్టైన్మెంట్Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్టోరీ ఇదేనా.. బయపడిపోతున్న మహేష్ ఫాన్స్

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్టోరీ ఇదేనా.. బయపడిపోతున్న మహేష్ ఫాన్స్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అభిమానుల ముందుకి సర్కారు వారి పాట అనే సినిమా తో వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై కేవలం అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..పైగా ఈ సినిమా దర్శకుడు పరశురామ్ పెట్ల గీత గోవిందం అనే సినిమా తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు..ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..అలాంటి హిట్ సినిమా తర్వాత ఒక్క స్టార్ హీరో తో చేస్తున్న సినిమా కావడం తో ట్రేడ్ లో కూడా ఈ సినిమా బిజినెస్ ఫుల్ స్వింగ్ లో సాగుతుంది..ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదల అయినా రెండు పాటలు మరియు టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం కూడా ఈ సినిమా పై క్రేజ్ పెరగడానికి కారణం అయ్యింది.

Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata

అయితే ఈ సినిమా కి సంబంధించిన స్టోరీ లైన్ ఇటీవల బుక్ మై షో యాప్ లో చూసిన అభిమానులు కంగారు పడిపోతున్నారు..అసలు స్టార్ విషయానికి వస్తే అజయ్ ( మహేష్ బాబు ) దుబాయి లోని ఒక్క సిటీ లో లోన్ రికవరీ ఏజెంట్ గా పని చేస్తూ ఉంటాడు..అనుకోకుండా తన సొంత ఊరిలో ఒక్క సమస్య రావడం తో తన రూట్ ని మార్చుకొని అక్కడికి వెళ్లి ఆ సమస్య ని పరిష్కరించడమే ఈ సినిమా స్టోరీ లైన్ అన్నట్టు తెలుస్తుంది..ఇలాంటి సినిమాలు మహేష్ బాబు శ్రీమంతుడు నుండి వరుసగా తీస్తూనే ఉన్నాడు..సినిమా నేపథ్యం వేరు అయినా కథ మాత్రం దాదాపుగా ప్రతి సినిమాకి ఒక్కటిగా ఉంది.

Also Read: Pawan Kalyan Son First Film: పవన్ కళ్యాణ్ కొడుకు మొదటి సినిమా ఆ దర్శకుడితో..??

మల్లి అదే కధాంశం తో తీస్తే ఈసారి జనాలకు చిరాకు కలిగే ప్రమాదం ఉంది అని అభిమానులు కంగారు పడుతున్నారు..కానీ స్టోరీ లైన్ రొటీన్ గా ఉన్నప్పటికీ పరశురామ్ తన మార్క్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని జోడించి సినిమా ని తీస్తాడు అని..కాబట్టి అభిమానులు భయపడాల్సిన అవసరం లేదు అని, మహేష్ తన బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర సర్కారు వారి పాట తో కూడా విరామం లేకుండా కొనసాగిస్తాడు అని కొంతమంది అభిమానులు మిగిలిన అభిమానులకు సోషల్ మీడియా లో సర్ది చెప్పుకుంటున్నారు..మరి ఈ సినిమా ఎంతమేరకు వారి అంచనాలను అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే నెల వరుకు వేచి చూడాల్సిందే.

Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata

ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది..సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాని నిర్మించబోతున్నాడు..ఇటీవల ఈయన నిర్మించిన DJ టిల్లు మరియు భీమ్లా నాయక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న నాగ వంశి ఈ సినిమాని కూడా అదే ఊపు లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..ఖలేజా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి..సాధ్యమైనంత తొందరగా ఈ సినిమాని పూర్తి చేసి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయ్యే సినిమాలో నటించబోతున్నాడు మహేష్ బాబు.

Also Read:Chiranjeevi Ram Charan: కొడుకును డామినేట్ చేయడానికి చిరంజీవి స్కెచ్.. తగ్గేదేలే అన్న రాంచరణ్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

  1. […] Beast Box Office Collection: త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కు తెలుగులో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డి స్టార్ హీరోల సినిమాల‌కు కూడా పోటీ ఇస్తుంటాయి. అంత‌లా ఆయ‌న ఇక్క‌డ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక‌పోతే ఆయ‌న న‌టించిన బీస్ట్ మూవీ భారీ అంచ‌నాల న‌డుమ తెలుగులో విడుద‌లైంది. ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ మోడ్ లో ఉన్న ఈ మూవీకి విప‌రీత‌మైన హైప్ వ‌చ్చింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular