Crazy Kalyanam First Look: ప్రస్తుతం తెలంగాణ యాసతో తెరకెక్కే సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. రీసెంట్ గా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పుడు ‘క్రేజీ కళ్యాణం’ అంటూ మరో సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు…ఈ సినిమాను యారో సినిమాస్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ 2 గా బూసామ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు… ఇక రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ని రివిల్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా పల్లెటూరు వాతావరణంలో తెరకెక్కుతుండటం విశేషం … ఇక ఈ సినిమాకి భద్రప్ప గాజుల అనే వ్యక్తి దర్శకుడిగా వ్యవహరిస్తూన్నాడు.
ప్యూర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సగటు ప్రేక్షకులను మెపిస్తుందంటూ దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేశారు. వీలైనంత తొందరలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా సురేష్ బబ్బిలి వ్యవహరిస్తూ ఉండడం విశేషం… ఈ మధ్యకాలంలో ‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి రెండు చిన్న సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఈ రెండు సినిమాలకి సురేష్ బబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం విశేషం…
సినిమా ప్రేక్షకుడికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా? తద్వారా ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమాకి గోరంటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్ లాంటి లిరిక్స్ రైటర్లుగా పాటలను రాస్తున్నారు…