Megastar Chiranjeevi: ‘మెగాస్టార్ చిరంజీవి’ అరవై ఆరేళ్ళ వయసులో కూడా సినిమాల వేగం మాత్రం తగ్గించడం లేదు. దీనికి తోడు, ఈ మధ్య చిరు క్రేజ్ డబుల్ అయింది. అసలుకే స్టార్ డైరెక్టర్లు అంతా మెగాస్టార్ తో సినిమా చేయాలని ఆశ పడతారు. ఇప్పుడు స్వయంగా చిరునే పిలిచి మరీ డేట్లు ఇస్తున్నాడు. ఇది ఎవ్వరూ ఊహించలేదు. నిజానికి ఒకప్పుడు మెగాస్టార్ డేట్లు కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది రివర్స్ అయ్యింది.

చిన్న దర్శకులకు చిరు ఈజీగా ఛాన్స్ ఇస్తున్నాడు. మెహర్ రమేష్, బాబీ, ప్రస్తుతం మారుతి ఇలా అందరూ చిన్న డైరెక్టర్లే. మరోపక్క చిరుతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో ఫిక్స్ కానున్న మెగాస్టార్ సినిమాల లిస్ట్ చూస్తే మతిపోతుంది. భారీ కాంబినేషన్స్ లో మెగాస్టార్ సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ కాంబినేషన్స్ ఏమిటో చూద్దాం.
Also Read: Sammathame 4th Day Collections: ‘సమ్మతమే’కి 4 డేస్ కలెక్షన్స్.. బాగానే పుంజుకుంది !
ప్రస్తుతం మెగాస్టార్ మోహన్ రాజాతో చేస్తున్న సినిమాని భారీ స్థాయిలో చేస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని యాడ్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే తీయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు. తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, మెగాస్టార్ తో పక్కా మాస్ సినిమా చేస్తాడట సుజిత్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ టాలెంట్ కి ఫుల్ డిమాండ్ ఉంది. మెగాస్టార్ తో సినిమా అంటే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.
ఇక సుజిత్ తో సినిమా తర్వాత.. చిరు, డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి డేట్లు ఇచ్చాడని టాక్. పూరితో చేయబోయే సినిమా వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ సినిమా తర్వాత, నిర్మాత దిల్ రాజు, చిరు హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. దాదాపు ఈ కలయికలో సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

అలాగే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని మైత్రీ మూవీస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, మరియు నిర్మాత సి. కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాయి. వీటికి కూడా స్టార్ డైరెక్టర్లే ఉంటారట. కాకపోతే ఈ సినిమాలు అన్నీ మరో ఏడాది తర్వాతే స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
Also Read:Sobhita Dhulipala: నాగచైతన్యతో ఎఫైర్: శోభిత మిడిల్ ఫింగర్ ఫొటో వైరల్
[…] Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ తో క్రేజీ కాంబినే… […]
[…] Also Read:Megastar Chiranjeevi: మెగాస్టార్ తో క్రేజీ కాంబినే… […]