TS Inter Marks Memos 2022: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. మొదటి, రెండో సంవత్సరం రిజల్ట్స్ నేడు విడుదల కావడంతో విద్యార్థులు తమ మార్కులు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేసిన విద్యాశాఖ ఈ సంవత్సరం 70 శాతం సెలబస్ తోనైనా పరీక్షలు నిర్వహించింది. దీంతో మార్కుల జాబితా కూడా విడుదల చేసింది. దీంతో నేడు రాష్ట్రంలోని విద్యార్థులందరు తమ మార్కులను వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్నారు.

మార్కుల్లో ఏవైనా అనుమానాలుంటే రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎలాంటి అనుమనాలకు తావు లేకుండా ఫలితాల వెల్లడిలో పారదర్శకత పాటించింది. పొరపాట్లు జరగకుండా చూసేందుకు సమయం కూడా తీసుకుని ఆలస్యంగానైనా ఆటంకాలు లేకుండా చూసుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు ఇంకా ఏవైనా సందేహాలుంటే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం నిర్దేశించిన సూచనల ప్రకారం విద్యార్థులు తమ దరఖాస్తులు పంపుకోవచ్చని పేర్కొంది.
Also Read: Dissent Leaders In YCP: వైసీపీ నేతల్లోనే అసమ్మతి కుంపట్లా? ఏం జరుగుతోంది?
విద్యార్థులు మొదట ప్రభుత్వ వెబ్ సైట్ లోకి వెళ్లి తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మార్కుల జాబితా కనబడుతుంది. దాన్ని పీడీఎఫ్ లో సేవ్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏవైనా అనుమానాలుంటే సంబంధిత బోర్డుకు ఫిర్యాదు చేసుకుని వాటిని నివృత్తి చేసుకోవచ్చు. మార్కుల్లో కూడా ఏవైనా తేడాలనిపిస్తే రీ కౌంటింగ్ కు సైతం ఫీజు కట్టి తమ మార్కులను మళ్లీ చూసుకోవచ్చని సూచిస్తోంది. దీనిపై విద్యార్థులు అందరు కూడా బోర్డును సంప్రదించాలని కోరింది. మార్కులు డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకుని మార్కులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మొత్తానికి విద్యాశాఖ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకుంది. గతంలో జరిగిన పొరపాట్లతో అపవాదు మూటకట్టుకోవడంతో ఈ సారి అలా కాకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంది. ఫలితాల వెల్లడిలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఎలాంటి అనుమానాలు రాకుండా ముందస్తుగా అన్ని విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించిందని తెలుస్తోంది. అందుకే గొడవలు లేని ఫలితాలు వెల్లడించి విద్యాశాఖ తన పరువు నిలుపుకుంది.
Also Read:Tamil Star Hero: వైసీపీ MLA గా పోటీ చెయ్యబోతున్న తమిళ స్టార్ హీరో