Buchibabu Movie with NTR: ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఆయన డెబ్యూ మూవీ ఉప్పెన ప్రభంజనం సృష్టించింది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఉప్పెన చిత్రం వంద కోట్ల వసూళ్లతో నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించింది. మూడు రెట్లు లాభాలు పంచిన ఉప్పెన చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కొత్త హీరో హీరోయిన్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలతో బుచ్చిబాబు సానా చేసిన ప్రయోగం ప్రేక్షకులను మాయ చేసింది.

మొదటి చిత్రంతోనే ఈ స్థాయి విజయం సాధించిన బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ ఎవరితో అన్న మీమాంస కొనసాగుతుంది. ఆయన లిస్ట్ లో స్టార్ హీరోలు ఉన్నారంటూ పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖంగా ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సానా ఓకే చేశారనేది లేటెస్ట్ బజ్. బుచ్చిబాబు స్క్రిప్ట్ కి ఫిదా అయిన ఎన్టీఆర్ మూవీ చేద్దామనే హామీ ఇచ్చారట.
Also Read: సాయంత్రం 4.05 గంటలకు రవితేజ ‘ఫుల్ కిక్కు’ రిలీజ్ !
ఎన్టీఆర్ ఒప్పుకున్న చిత్రాలు పూర్తయిన వెంటనే బుచ్చిబాబు మూవీ చేస్తారనేది ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతున్న సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బుచ్చిబాబు కంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరు. స్టార్ దర్శకులతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ఎన్టీఆర్ బుచ్చిబాబుకు అవకాశం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అయితే బుచ్చిబాబుకు ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉంది.

సుకుమార్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో మూవీ చేయగా… ఆ చిత్రానికి బుచ్చిబాబు పని చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్, బుచ్చిబాబుకు పరిచయం ఏర్పడింది. నాన్నకు ప్రేమతో షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తనతో చాలా ఆప్యాయంగా మాట్లాడినట్లు బుచ్చిబాబు తెలియజేశాడు. మరి ఎంత స్నేహం ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన జరిగే వరకు ఈ కాంబినేషన్ నమ్మలేం.
ఇక ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధంగా కాగా… కొరటాలతో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ ప్రకటించారు. దర్శకుడు అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి ఎన్టీఆర్-బుచ్చిబాబు మూవీ ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో.
Also Read: మరో హీరోకి కరోనా పాజిటివ్.. ఎవర్నీ వదలను అంటున్న కరోనా !