Annamalai: అన్నాడీఎంకే కంచుకోట కొంగునాడు అన్నామలై పాదయాత్రతో బద్దలు

అన్నాడీఎంకే కంచుకోట కొంగునాడు అన్నామలై పాదయాత్రతో బద్దలైన డీఎంకే ఆగ్రహంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 24, 2023 4:09 pm

అన్నామలై.. మొదట్లో విస్మరించారు. తర్వాత హేళన చేశారు. ఇప్పుడు ఎదురుదాడి మొదలుపెట్టారు. గత శుక్రవారం అర్థరాత్రి తర్వాత తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న వేళ అన్నామలై ఇంటి ముందు బీజేపీ జెండా కోసం తయారు చేసిన జెండాగద్దెను పోలీసులు తొలగించారు. అదీ డైరెక్టుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి తొలగించారు. అసలు తమిళనాడులో ఎందుకీ పరిస్థితులు..? ఇన్నాళ్లు చేయనిదే ఇప్పుడే ఎందుకు చేశారు.? అన్నామలైకి భయపడుతున్నారా? అంటే ఔననే వాదన వినిపిస్తోంది.

కొంతమంది ఇస్లామిక్ వాదులు అన్నామలై ఇంటి ముందు బీజేపీ జెండా గద్దె మాకు ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేశారు. రోడ్డుకు అటు వైపు డీఎంకే బ్లాక్ జెండా గద్దె.. ఇటు వైపు అన్నాడీఎంకే జెండా గద్దె ఉన్నా బీజేపీ గద్దెనే తొలగించడంపై బీజేపీ వాదులు ఆందోళన చేశారు. నిరసన చేసిన బీజేపీ నేతలు, నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. లాఠీ చార్జి చేశారు. పోలీసు స్టేషన్ కు తరలించి అరెస్ట్ చేశారు.

నాలుగు గంటల తర్వాత వచ్చి అన్నామలై పాదయాత్రను పర్యవేక్షించే కీలక నేత బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. శని, ఆదివారం, సోమవారం లాంగ్ వీకెండ్ సెలవులు కావడంతో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.ఇదంతా ఏంటని జర్నలిస్టులు అన్నామలైని అడగగా.. ‘మా వాళ్లు జెండా కోసం పోరాడి జైలుకు వెళ్లి హీరోలయ్యారు. నాడు స్వాతంత్ర్య పోరాటంలోనూ ఇలానే మన జెండా కోసం పోరాడిన వారిని బ్రిటీష్ వారు అరెస్ట్ చేయడంతో నాడు స్వాతంత్ర్య సమరయోధులయ్యారు. ఇప్పుడు మా వాళ్లు అయ్యారని తెలిపారు.

దీనికి నిరసనగా నవంబర్ 1 నుంచి 100 రోజులు తమ బీజేపీ నేతలు తమ తమ ప్రాంతాలు బీజేపీ జెండా గద్దెలు ఏర్పాటు చేసి జెండా ఎగురవేసి నిరసన తెలుపాలని అన్నామలై పిలుపునిచ్చారు.

అన్నాడీఎంకే కంచుకోట కొంగునాడు అన్నామలై పాదయాత్రతో బద్దలైన డీఎంకే ఆగ్రహంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.