Anasuya Bharadwaj: ఫైర్ బ్రాండ్ అనసూయ సోషల్ మీడియా బిహేవియర్ మైండ్ బ్లాక్ చేస్తుంది. పర్సనల్ లైఫ్ ని కూడా ఫొటోల్లో బంధించి ఇంస్టాగ్రామ్ లో పెడుతుంది. అదేమంటే నా ఇష్టం అంటుంది. హేటర్స్ ఎక్కువయ్యాక అనసూయ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతున్నారు. మీరు ఎంత విమర్శిస్తే అంతగా ఎక్కువ చేస్తాను అంటుంది. తాజాగా బెడ్ పై నైట్ వేర్లో ఉన్న ఫోటో షేర్ చేశారు. దానికి ఓ క్యాప్షన్ ఇచ్చింది. తన ఫోటోను కొడుకు తీశాడట. అలసిపోయాను, వర్క్ అవుట్ జోన్ కి వెళ్లాలా లేదా? అని కామెంట్ పెట్టింది.
బెడ్ రూమ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టాలా? అని నెటిజెన్స్ ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవల అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడిచింది. విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది’ అని వాడటాన్ని అనసూయ తప్పుబట్టారు. పైత్యం బాగా ఎక్కువైంది అంటూ సెటైర్ వేశారు. దాంతో ఆగ్రహానికి గురైన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. గతంలో కూడా లైగర్ మూవీ ఫెయిల్యూర్ పై అనసూయ సెటైర్ వేశారు. ఇలాగే ఆమెను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.
ఈ వివాదంలో కొందరు అనసూయనే తప్పుబట్టారు. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం ఎందుకని ఆమెను హెచ్చరిస్తున్నారు. అయితే నేను తగ్గేదేలే అని అనసూయ అంటున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియాను సైతం తప్పుబట్టారు. నిజం రాసే దమ్ము, ధైర్యం మీలో లేవన్నారు. ఇక నాలోని అమ్మను హర్ట్ చేశారు. ఆమె తిరగబడితే ఏం చేస్తుందో చూపిస్తా. మీరు ఎంత బురద చల్లినా, క్రిందకు లాగాలని చూసినా నేను వెనక్కి తగ్గనంటూ సందేశం పోస్ట్ చేసింది.
జబర్దస్త్ వేదికగా అనసూయ పాపులారిటీ తెచ్చుకున్నారు. స్టార్ యాంకర్ గా ఎదిగారు. బుల్లితెరకు బోల్డ్ నెస్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ అనసూయ. ఇది ఆమెపై అత్యంత నెగిటివిటీ కారణమైంది. అనసూయ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదమైంది. అనసూయ సమర్ధించుకున్నారే కానీ తన తీరు మార్చుకుంది లేదు. ఏడాది కాలంగా అనసూయ యాంకరింగ్ కి దూరంగా ఉంటున్నారు. ఆమెకు సినిమా ఆఫర్స్ విరివిగా వస్తున్న నేపథ్యంలో నటిగా సెటిల్ అయ్యారు.