ఇప్పటికే సోనూ సూద్ కి సాయం చేయమంటూ కాల్స్ అధికంగా వస్తున్నాయి. ఈ కరోనా సంక్షోభ సమయంలో సోను సూద్ అందరికీ ఆశా జ్యోతిగా కనిపిస్తున్నాడు. సాయం అడిగిన ప్రతివారికి సేవ చేస్తున్నాడు. ఆపదలో ఉన్నాం అని మెసేజ్ చేస్తేనే.. నేను ఉన్నానంటూ ముందుకు వెళిపోతున్నాడు. గత ఏడాది లాక్డౌన్ పీరియడ్ లో సోనూ చేసిన సేవ గొప్పది అని సరిపుచ్చలేం. అది అతని మంచి తనం అని తక్కువ చేసి మాట్లాడలేం.
ప్రభుత్వాలు చేయలేని మంచిని అతను చేశాడు. అందుకే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ రాగానే అందరూ ప్రభుత్వాలను అడగడం మానేసి.. సోనూ సూద్ సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు సిగ్గు పడాలి. మన స్టార్ హీరోలు సోనూ కాళ్ళు కడిగి ఆ నీళ్లను దాచుకుని రోజూ తీర్ధంలాగా సేవించాలి. లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్లు వేసే నటుడు, రోజుకు ఇంత అని రెమ్యునరేషన్ తీసుకునే నటుడు ఇంత గొప్ప సేవ చేస్తుంటే..
మరి ఒక్కో సినిమాకు ఏభై కోట్లు అరవై కోట్లు తీసుకునే మన హీరోలు ఏమి పీకుతున్నారు ? మా అభిమానులే మా ప్రాణం అని చెప్పే హీరోలను, ఆ అభిమానులందరూ చెప్పులతో తరిమికొట్టాలి. ఒక్క హీరోనైనా ఈ కరోనా కష్టకాలంలో తమ అభిమానులకు ఏదైనా మేలు చేశాడా ? ఆసుపత్రిలో బెడ్స్ దొరకడం లేదు. మందుల విషయంలో దేశమంతా కొరత ఉంది. పైగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉంది, దాంతో సాయం చేయమని ప్రజలందరూ సోను సూద్ కి కాల్స్, మెసెజ్ లు పెడుతున్నారు. ఏ.. హీరోలకు ఎందుకు మెసేజ్ లు పెట్టడం లేదు. ఎందుకంటే, ఈ హీరోలు జీరోలు అని అందరికీ రుజువై పోయింది కాబట్టి.