Court
Court : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్'(Court Movie) చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాని సినిమా అంటే ఆడియన్స్ లో మొదటి నుండి ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. కచ్చితంగా ఇతను సూపర్ హిట్ సినిమానే తీస్తాడు అనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన హీరోగా నటించిన సినిమాలు కొన్ని అంచనాలను అందుకోకపోయుండొచ్చు కానీ, నిర్మాతగా వ్యవహరించిన సినిమాలన్నీ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆ కోవలోకే ‘కోర్ట్’ చిత్రం చేరింది. విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్స్ షోస్ ద్వారా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం విడుదల రోజు కూడా అదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫలితంగా నాని గత సినిమాలకంటే ఎక్కువ ఓపెనింగ్ వసూళ్లను రాబట్టింది.
Also Read : ప్రీమియర్ షోస్ నుండి ‘కోర్ట్’ మూవీ ఇంత గ్రాస్ వసూళ్లు వచ్చాయా..నాని బ్రాండ్ ఇమేజ్ పవర్ మామూలుగా లేదుగా!
ప్రీమియర్ షోస్ నుండి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మొదటి రోజు కి కూడా కలిపి ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఊహించని రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం నార్త్ అమెరికా నుండి ప్రీమియర్ షోస్ ద్వారా ఈ చిత్రానికి 1 లక్ష 60 వేల డాలర్లు రాగా, ప్రీమియర్+ మొదటి రోజుకి కలిపి దాదాపుగా 2 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే వీకెండ్ కి ఈ చిత్రం కేవలం నార్త్ అమెరికా నుండి ఆరు లక్షల డాలర్స్ ని రాబట్టే అవకాశం ఉందట. ఇక ఓవరాల్ గా మొదటి రోజు వచ్చిన గ్రాస్ వసూళ్లు దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.
షేర్ వసూళ్లు 5 కోట్ల రూపాయలకు దగ్గరగా ఉండొచ్చు. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ముందు నాని హీరో గా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ఓపెనింగ్స్ కంటే ‘కోర్ట్’ కి ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే రెండవ రోజు కూడా ఈ సినిమాకి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. బుక్ మై షో యాప్ లో గంటకు 7 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, కేవలం రెండవ రోజుతోనే రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఏడాది అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సౌత్ ఇండియన్ సినిమాలలో కచ్చితంగా ‘కోర్ట్’ చిత్రం చేరుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. చూడాలి మరి ఏ రేంజ్ లాభాలను ఈ సినిమా తెచ్చిపెడుతుంది అనేది.
Also Read : కోర్టు’ ఫుల్ మూవీ రివ్యూ