Court Collection: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవరించిన ‘కోర్ట్'(Court Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ కచ్చితంగా అందరికీ సర్ప్రైజ్ అనొచ్చు. అదే జోరుని ఈ చిత్రం రెండవ రోజు కూడా కొనసాగించింది. అనేక ప్రాంతాల్లో ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కేవలం ప్రీమియర్ షోస్ నుండే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిందని నిర్మాత నాని అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలిపాడు. ఇక రెండవ రోజు అయితే ఈ సినిమాకి 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
Also Read: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ కి మోక్షం దక్కేది అప్పుడేనా..?
మొత్తం మీద ప్రాంతాల వారీగా ఈ సినిమాకి రెండు రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో వివరంగా చూద్దాము. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరగగా, రెండు రోజుల్లో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను, అదే విధంగా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది అత్యంత వేగంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఏకైక సినిమా ఇదే. నైజాం ప్రాంతం లో 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతంలో 34 లక్షలు, ఆంధ్ర ప్రాంతంలో 2 కోట్ల 20 లక్షల రూపాయిలు రాబట్టింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రెండు రోజుల్లో 5 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం దుమ్ము లేపుతుంది.
నార్త్ అమెరికా + రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుండి ఈ సినిమాకు రెండు రోజుల్లో 2 కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 7 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నేడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిర్మాతగా నాని జాక్పాట్ కొట్టినట్టే ఈ చిత్రంతో.
Also Read: ‘పుష్ప 3’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాత..అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇక పండగే!