Couple Friendly Movie Box Office: ఈమధ్య కాలం లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు మామూలు రేంజ్ లో లేవు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన ప్రభావం చూపుతూ భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా సంతోష్ శోభన్,(Santosh Sobhan) మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly) అనే చిత్రం విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హీరో హీరోయిన్లు విడుదలకు ముందు తమ శక్తికి మించి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు, టీజర్, ట్రైలర్ వంటివి చాలా బాగున్నాయి, హిట్ అయితే బాగుండును అని అంతా కోరుకున్నారు. కోరుకున్నట్టుగానే ఈ చిత్రం కేవలం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు, కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి కేవలం కోటి రూపాయిల ఖర్చు మాత్రమే అయ్యింది.
కానీ నాలుగు రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు ఎంతో ఒకసారి వివరంగా చూద్దాం. ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మూడవ రోజున వరల్డ్ వైడ్ 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, నాల్గవ రోజున 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ ఈ రెండు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయలకు పైనే ఉంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో వచ్చిన వసూళ్ళని ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 1.04 కోట్లు, ఆంధ్రా + సీడెడ్ నుండి 1.11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2.15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 4.30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 2.86 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 5.90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 6.5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అంటే మరో 3.64 కోట్ల రూపాయిల షేర్ రావాలి అన్నమాట. ఈ వీకెండ్ తో ఈ చిత్రం ఆ మార్కుని కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.