Couple Friendly movie : ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా చిన్న సినిమాగా విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). సంతోష్ శోభన్(Santosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం సహజత్వానికి చాలా దగ్గరగా ఉందని, యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ చేసే కంటెంట్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చుకోదగ్గ సన్నివేశాలు ఈ చిత్రం లో చాలానే ఉన్నాయని క్రిటిక్స్ సైతం రివ్యూస్ ఇవ్వడం తో ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు దాదాపుగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెండు రోజులకు కలిపి ప్రాంచవ్యాప్తంగా 3 కోట్ల 65 లక్షల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అయినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఒకసారి వివరంగా చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి రెండు రోజులకు కలిపి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్, సీడెడ్ నుండి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 1 కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 2 కోట్ల 45 లక్షల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1 కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 3 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 4 కోట్ల రూపాయలకు జరగ్గా.
తమిళ వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తమిళ నాడు లో కోటి రూపాయలకు జరిగింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రెండు వెర్షన్స్ కి కలిపి 6.5 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం కచ్చితంగా మరో 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. సినిమాకు పబ్లిక్ లో పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి, ఈ వీకెండ్ తో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెడుతుంది బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 13 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. దీనిని బట్టీ చూస్తే కచ్చితంగా ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉందని అనిపిస్తోంది.