https://oktelugu.com/

నితిన్ కి కోట్లు నష్టం చేసిన కరోనా

”లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం” వంటి మూడు వరుస అపజయాల తర్వాత `భీష్మ` చిత్రం తో బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ అందుకొని జోరు మీదున్న నితిన్ ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.వాటిల్లో ఒకటి నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ `అంధాదున్ `చిత్రానికి రీమేక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ […]

Written By:
  • admin
  • , Updated On : April 6, 2020 / 02:14 PM IST
    Follow us on


    ”లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం” వంటి మూడు వరుస అపజయాల తర్వాత `భీష్మ` చిత్రం తో బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ అందుకొని జోరు మీదున్న నితిన్ ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.వాటిల్లో ఒకటి నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ `అంధాదున్ `చిత్రానికి రీమేక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ చిత్రంలోనూ నటించబోతున్నాడు . ఇవీ రెండు కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ , మహమ్మారి కరోనా కారణం గా కోట్లు నష్ట పోయాడని తెలుస్తోంది. త్వరలో విడుదల కావాల్సిన తన కొత్త చిత్రం విషయం లో అలా జరిగిందట ..

    ఇంతకీ అసలి విషయం ఏమిటంటే రాబోయే నితిన్ చిత్రాల్లో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తోన్న `రంగ్ దే` చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం భీష్మ వంటి హిట్ సినిమా తరవాతి చిత్రం కావడంతో `రంగ్ దే ` కు మంచి బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా శాటిలైట్, డిజిటల్ హక్కులకు గాను ప్రముఖ జీ ఛానెల్ 10 కోట్ల రూపాయలను ఇవ్వడానికి రెడీ అయ్యింది. అయితే నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ.12 కోట్లు అడగడం, చివరకు డీల్ 11 కోట్లకు ఓకే అవ్వడం జరిగింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ డీల్ అర్ధాంతరంగా ఆగి పోయింది . దరిమిలా నితిన్ ` రంగ్ దే `చిత్రం కోట్లు నష్ట పోయింది.