https://oktelugu.com/

సెకండ్ వేవ్ టెన్షన్ లేదు.. టాలీవుడ్ ధీమా..

మొదటిసారి కరోనా వచ్చినప్పుడు ఆ టెన్షన్ అంతా ఇంతాకదు.. ఒక్కకేసు నమోదు అవ్వడంతోనే ఆ ప్రాంతమంతా లాక్ డౌన్.. అన్ని పరిశ్రమలు షట్ డౌన్ అయ్యాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి. ప్రపంచమే అల్లకల్లోలం అయ్యింది. అయితే అప్పటికీ అసలు కరోనా అంటే చాలా మంది తెలియదు. దానిని ఎలా ఆపాలో కూడా ఎవరికీ తెలియదు. దాంతో చాలా మంది నానా హైరానా పడిపోయారు. కానీ ఇప్పుడు అలా కాదు.. కరోనాకి మందులు వచ్చాయి.. వ్యాక్సిన్ వేస్తున్నారు. మరణాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 23, 2021 / 11:35 AM IST
    Follow us on


    మొదటిసారి కరోనా వచ్చినప్పుడు ఆ టెన్షన్ అంతా ఇంతాకదు.. ఒక్కకేసు నమోదు అవ్వడంతోనే ఆ ప్రాంతమంతా లాక్ డౌన్.. అన్ని పరిశ్రమలు షట్ డౌన్ అయ్యాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి. ప్రపంచమే అల్లకల్లోలం అయ్యింది. అయితే అప్పటికీ అసలు కరోనా అంటే చాలా మంది తెలియదు. దానిని ఎలా ఆపాలో కూడా ఎవరికీ తెలియదు. దాంతో చాలా మంది నానా హైరానా పడిపోయారు. కానీ ఇప్పుడు అలా కాదు.. కరోనాకి మందులు వచ్చాయి.. వ్యాక్సిన్ వేస్తున్నారు. మరణాలు తగ్గాయి.. వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని కాబట్టి ప్రజల్లో ధీమా పెరిగింది.

    అయితే సరిగ్గా ఏడాది తరువాత మళ్లీ కరోనా చాపకింద నీరులా కరోనా విస్తరిస్తోంది. కేసులు పెరిగిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టేస్తున్నారు. అయితే జనం విచ్చలవిడిగా తిరుగుతుండడంతో పాటు గుంపులు, గుంపులుగా ఉండడం కారణంగానే సెకండ్ వేవ్ ముప్పు పెరిగిందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. దీనిని కట్టడి చేయాలంటే కొద్దిరోజులు లాక్ డౌన్ పెడితే సరిపోతుందని భావిస్తున్నారు. సెకండ్ వేవ్ ప్రాబల్యం పెద్దగా ఉండదని.. త్వరగానే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    సెకండ్ వేవ్ ఎక్కువకాలం కొనసాగితే.. టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ పరిస్థితి ఏమిటి? అంటే కేవలం మహా నగరాల వరకు కొంత ఇబ్బంది కరంగా ఉంటుందని.. ఇతర చోట్ల కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదల తేదీలను ప్రకటించిన నిర్మాతల్లో మాత్రం చాలా వరకు టెన్షన్ నెలకొంది.

    ఇప్పటికైతే తెలుగురాష్ట్రాల్లో కరోనా ప్రభావం అదుపులోనే ఉంది. దీంతో టాలీవుడ్ సినిమావాళ్లు కాస్త ఊరట పొందుతున్నారు. అటు ముంబయి, మహరాష్ట్రలో పరిస్థితి మరోసారి చేయి దాటిపోయింది. దేశంలో ముఖ్యంగా ఉత్తరాధి ప్రాంతాన వేలాది కేసులు ఒక్కరోజులోనే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మర్ రిలీజ్ కోసం చాలా వరకు బాలీవుడ్ భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇవ్వన్ని వాయిదా పడుతాయా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సల్మాన్.. రాధే.. అక్షయ్ సూర్యవంశీ వంటి సినిమాలు సమ్మర్ రేసునుంచి వెనక్కి వెళ్లాయనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో అరణ్య.. రంగ్ దే విడుదల అవుతున్నాయి. తరువాత వకీల్ సాబ్.. చిత్రం రానుంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులు పెట్టిన నిర్మాతల్లో కరోనా కొంతమేర టెన్షన్ పెట్టిస్తోంది. లాక్ డౌన్ సందర్భం రాకపోతే.. అంతా సజావుగా సాగుతుందనే ధీమా కూడా వ్యక్తం అవుతోంది.