Telugu movies: కాపీ దర్శకులకు పెద్ద సమస్య అయిపోయింది !

Telugu movies: టీవీ లేని కాలంలో ఎక్కువ శాతం జనాలు సొంత భాష చిత్రాలు మాత్రమే చూసేవారు. సినీ పరిశ్రమలో ఉన్న వారు మాత్రమే పర భాష చిత్రాలు చూసి ఇతర భాషా చిత్రాలను అనుసరించేవారు. కానీ టీవీలు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మన జీవితాల్లోకి వచ్చాక, ఇక ఇతర భాష చిత్రాలు కూడా మన చేతిలోకి వచ్చేశాయి. సహజంగానే హాలీవుడ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ రోజుల్లో మన వాళ్ళు ఆ చిత్రాలను ఆదర్శంగా తీసుకుని […]

Written By: admin, Updated On : August 30, 2021 10:54 am
Follow us on

Telugu movies: టీవీ లేని కాలంలో ఎక్కువ శాతం జనాలు సొంత భాష చిత్రాలు మాత్రమే చూసేవారు. సినీ పరిశ్రమలో ఉన్న వారు మాత్రమే పర భాష చిత్రాలు చూసి ఇతర భాషా చిత్రాలను అనుసరించేవారు. కానీ టీవీలు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మన జీవితాల్లోకి వచ్చాక, ఇక ఇతర భాష చిత్రాలు కూడా మన చేతిలోకి వచ్చేశాయి. సహజంగానే హాలీవుడ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ రోజుల్లో మన వాళ్ళు ఆ చిత్రాలను ఆదర్శంగా తీసుకుని కొన్ని చిత్రాలు తీశారు.

కానీ మరికొందరు ఆ హాలీవుడ్ సినిమాలను మన సమాజానికి సరిపోయేలా కొన్ని మార్పులు చేసి ఆ చిత్ర కథలనే కాదు, కొంత మంది దర్శకులు అయితే ఆ సన్నివేశాల టేకింగ్ ను కూడా కాపీ చేయడం మొదలుపెట్టారు. ఇక సంగీత దర్శకులు అయితే, పాటలను తస్కరిస్తూ అది తమ జన్మ హక్కుగా భావిస్తున్నారు.

అయితే, ఇప్పుడు అంతర్జాలం బాగా అభివృద్ధి చెందడం ఈ కాపీ రాయుళ్లకు పెద్ద సమస్య అయిపోయింది. ప్రేక్షకులు అన్ని భాషా చిత్రాలను చూస్తున్నారు. దీనికితోడు కరోనా వల్ల అందరూ గృహ నిర్భంధం అయ్యారు కాబట్టి, ఈ ఖాళీ సమయంలో హాలీవుడ్ కంటెంట్ కు బాగా అలవాటు పడ్డారు.

దాంతో మన దర్శకులు ఎక్కడ నుంచి కాపీ కొడుతున్నారో కనిపెట్టేస్తున్నారు. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో కాపీ చిత్రాలు, కాపీ సన్నివేశాలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇది కాపీ దర్శకులకు పెద్ద సమస్య అయిపోయింది. అయినా ఏదైనా చిత్రం నచ్చితే… మనకు ఆ దర్శకుడి మీద చాలా గౌరవం, మంచి అభిప్రాయం కలుగుతుంది.

కానీ, ఆ దర్శకుడు చాలా గొప్పగా తీశాడే అనుకున్న ఆ సినిమా కాపీ అని తెలిసినప్పుడు, ఆ దర్శకుడు ప్రేక్షకులను మోసం చేసినట్లు అనిపిస్తుంది. అయినా కాపీ చేసినప్పుడు, వాటి నుంచి ఆదర్శంగా తీసుకున్నాం అని చెబితే కనీస గౌరవం అయినా దక్కుతుంది కదా.