బాహుబలి దెబ్బకు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. ఆ తర్వాత వరుసగా ప్యాన్ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’(Radheshyam) మూవీ పూర్తి చేశాడు. ఈ సినిమా నుంచి ప్రతీ సందర్భానికి ఒకటి చొప్పున పోస్టర్లు, టీజర్లు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ ప్రేమ కథ చిత్రం. పైగా శ్రీకృష్ణుడికి సంబంధించిన టైటిల్ కావడంతో ఈ కృష్ణాష్టమికి ప్రభాస్(Prabhas) తన ఫ్యాన్స్ కు మరో పోస్టర్ తో ఖుషీ చేశారు.
వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా హీరోయిన్ పూజా హెగ్డె(Puja Hegde) నటించింది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేశారు. తాజాగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘రాధేశ్యామ్’ టీం అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ ఆకట్టుకునేలా శ్రీకృష్ణుడి నెమల ఈకలతో తీర్చిదిద్దారు. ప్రభాస్-పూజా చిరునవ్వులు చిందిస్తూ ఒక సంగీత పరికరం ముందు కూర్చొని ఉండగా.. పూజాకు సంగీతం నేర్పిస్తున్న ప్రభాస్ ఫొటోను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రేమ భావన కలిగిస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా తీర్చిదిద్దారు.
ప్రభాస్-పూజా పోస్టర్ బాగుందంటూ అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లతో పోలిస్తే ఈ సరికొత్త పోస్టర్ ఎంతో ప్రత్యేకం అని అంటున్నారు. ‘డార్లింగ్’ మూవీ తర్వాత లవర్ బాయ్ గా ప్రభాస్ చేస్తున్న పూర్తి స్థాయి లవ్ స్టోరీ ఇదేనంటున్నారు.
కే.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ అనే పాత్ర పోషిస్తున్నారు. అలనాటి భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. వచ్చేఏడాది జనవరి 14న సినిమాను విడుదల చేయడానికి యోచిస్తున్నారు.
As we celebrate Janmashtami, let Vikramaditya and Prerna teach you a new meaning of love! 💕
Here's wishing you all a very Happy Janmashtami! #RadheShyamStarring #Prabhas & @hegdepooja pic.twitter.com/LqTUgADq7Q
— UV Creations (@UV_Creations) August 30, 2021