Coolie Vs War 2: ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక అందులో ముఖ్యంగా తమిళ్ స్టార్ హీరో అయిన రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ (Cooli) సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీయార్ కలిసి చేస్తున్న వార్ 2 (War 2) సినిమా కూడా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయాన్ని సాధించబోతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. నిజానికి రజనీకాంత్(Rajinikanth), నాగార్జున(Nagarjuna) ఇద్దరు కూడా కూలీ సినిమాలో చాలా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hruthik Roshan) వార్ 2 (వార్ 2) సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ నలుగురి మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది. మరి రజినీకాంత్, నాగార్జున చేసిన కూలీ సినిమా విజయం సాధిస్తుందా? లేదంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేసిన వార్ 2 సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఒకటి తమిళ్ సినిమా కాగా, మరొకటి బాలీవుడ్ సినిమా…తెలుగు నుంచి ఏ సినిమాలు లేకపోయినా కూడా తెలుగులో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఆ సినిమాల్లో భాగము అవ్వడం వల్ల తెలుగులో కూడా వాటికి చాలా మంచి డిమాండ్ అయితే కనిపిస్తోంది. ఇక దానికి తోడుగా మన ఇద్దరు హీరోలు ఉండటం వల్ల ఆయా సినిమాలకు తెలుగులో ఎలాంటి బిజినెస్ జరుగుతుంది.
ఆయా సినిమాలు ఎలాంటి ఓపెనింగ్స్ ని కలెక్ట్ చేయబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది… నాగార్జున, రజనీకాంత్ ఇద్దరు సీనియర్ హీరోలు కాగా, హృతిక్ రోషన్, ఎన్టీఆర్లు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక సీనియర్స్, జూనియర్స్ మధ్య జరుగుతున్న ఈ తీవ్రమైన పోటీలో గెలుపు ఎవరిది అంటు ఇప్పటికే చాలామంది ఈ సినిమాల గురించి చర్చించుకుంటున్నారు…