AM Ratnam Movies: ఈ ఏడాది మన అందరికి బాగా వినిపించిన నిర్మాత పేర్లలో ఒకటి AM రత్నం(AM Ratnam). ఈయన మనకి కేవలం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) నిర్మాతగా మాత్రమే నేటి తరం ఆడియన్స్ కి తెలుసు. కానీ AM రత్నం హిస్టరీ ని ఒక్కసారి పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే. ప్రముఖ హీరోయిన్ విజయశాంతి కి ఒకప్పుడు మేకప్ ఆర్టిస్టుగా AM రత్నం తన సినీ కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమెనే హీరోయిన్ గా పెట్టి కర్తవ్యం అనే సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టారు. అలా కారీర్ ని నిర్మాతగా మొదలు పెట్టిన AM రత్నం అప్పట్లోనే గ్రాండియర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ నిర్మాతలలో ఒకరిగా మారిపోయాడు. AM రత్నం తో కనీసం ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని సూపర్ స్టార్స్ అందరూ స్వయంగా ఆయన్ని కోరుకునే రేంజ్ లో అతి తక్కువ సమయంలోనే ఎదిగాడు AM రత్నం.
Also Read: మొన్న ‘ఎయిర్ ఇండియా’.. ఇప్పుడు TCS.. అసలు TATA కంపెనీలకి ఏమవుతుంది?
ఆయన తీసిన సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కర్తవ్యం చిత్రం తర్వాత ఆయన ఒక నిర్మాతగా వ్యవహరిస్తూనే,మరోపక్క దర్శకుడిగా మారి తన ప్రొడక్షన్ హౌస్ లో పెద్దరికం, ఆశయం వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. డైరెక్టర్ గా AM రత్నం లో ఇంత గొప్ప ప్రతిభ ఉందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయేలా చేసిన చిత్రాలివి. అలా సక్సెస్ ఫుల్ కెరీర్ ని సాగిస్తున్న AM రత్నం జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘ఇండియన్’. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తీస్తే ఇలాంటి సినిమాని తీయ్యాలిరా అని ప్రతీ ఒక్కరు గర్వంగా చెప్పుకునే రేంజ్ సినిమాని తీసాడు.
ఆ తర్వాత తమిళ హీరో శరత్ కుమార్ తో ‘నాత్పుక్కగా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్. తెలుగు లో ఈ చిత్రాన్ని మన మెగాస్టార్ చిరంజీవి ‘స్నేహం కోసం’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఒకేఒక్కడు, జెంటిల్ మ్యాన్, బాయ్స్, ఖుషి, గిల్లీ, ఆరంభం, ఎన్నై ఎరిందాల్, వేదలమ్, 7/G బృందావన కాలనీ, ఇలా ఎన్నో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పిన సినిమాలను ఆయన తెరకెక్కించాడు. ఆయన నిర్మాతగా వవహరించిన సినిమాల్లో కమర్షియల్ గా ఫెయిల్ అయ్యినవి బంగారం, నాగ, ముద్దుల కొడుకు, ఆక్సిజన్, రూల్స్ రంజన్, ఇక రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’ వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.