Coolie Movie: ఒక సినిమా ని థియేటర్ లో చూడడం కోసం కాలేజీలు సెలవులు ప్రకటించడం, పని చేసే ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం వంటివి అప్పట్లో మనం సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన ‘కబాలి’ చిత్రానికి చూశాము. మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి క్రేజ్ ని ‘కూలీ'(Coolie Movie) చిత్రానికి చూస్తున్నాము. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో రజినీకాంత్ హీరో గా నటించిన ఈ సినిమా పై, ఈమధ్య కాలం లో ఏ పాన్ ఇండియన్ సినిమాపై కూడా ఏర్పడనంత భారీ హైప్ ఏర్పడింది. యూత్, మాస్, క్లాస్ అని తేడా లేదు, అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే తమిళ సినిమాల్లో ఆల్ టైం రికార్డు గా నిల్చింది. ఇక కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అవ్వబోతున్నాయి.
Also Read: కెరియర్ మొదట్లో మోహన్ బాబు చేతిలో దెబ్బలు తిన్న నాని…అసలేం జరిగిందంటే..?
ఇది ఇలా ఉండగా ‘ఫార్మర్స్ కంస్ట్రక్షన్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ ‘కూలీ’ చిత్రం విడుదల సందర్భంగా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ ఒక సర్కులర్ ని జారీ చేసింది. ఈ సర్కులర్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. ఆ సర్కులర్ లో ఏముందంటే ‘ఆగష్టు 14 న సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా తమిళ వర్కర్స్ అందరికీ సెలవు ప్రకటిస్తున్నాము. అంతే కాకుండా కంపెనీ తరుపున మొదటి రోజు మొదటి ఆటకు సంబంధించిన టికెట్ ని ఉచితంగా ఇవ్వడం తో పాటు, 30 డాలర్లు ఖర్చులకు కూడా ఇస్తాము. పని వత్తిడి నుండి వర్కర్స్ కి రిలీఫ్ ని కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.
కంపెనీ కి సెలవు ఇవ్వడం వరకు బాగానే ఉంది. సెలవు ఇవ్వడమే కాకుండా మొదటి రోజు మొదటి ఆట టికెట్ ని చేతికి అందించి, ఖర్చులకు మరో 30 డాలర్లు ఇవ్వడం అంటే, కంపెనీ యాజమాన్యం రజినీకాంత్ కి ఎంత వీరాభిమానులు అనేది అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంచనాలు వేస్తున్నారు నెటిజెన్స్. ఇక టాక్ ఒక్కటే బ్యాలన్స్, అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ కూడా అక్కర్లేదు, కేవలం పర్వాలేదు , బాగుంది అనే రేంజ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చెల్లాచెదురు అయిపోతాయి. తమిళ సినిమాకు మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమాగా కూడా నిలుస్తుంది, చూడాలి మరి సూపర్ స్టార్ మ్యాజిక్ ఎలా ఉండబోతుంది అనేది.