Nagarjuna Coolie: రేపు విడుదల అవ్వబోతున్న ‘కూలీ'(Coolie Movie) మరియు ‘వార్ 2′(War 2 Movie) చిత్రాల్లో కూలీ కి ఎలాంటి క్రేజ్ ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం రజినీకాంత్ వల్లనే ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చింది అనుకుంటే పొరపాటే. రజినీకాంత్(Superstar Rajinikanth) తో లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ఈ సినిమా చేయడం , దానికి తోడు అనిరుద్ అందించిన అద్భుతమైన సాంగ్స్ కారణంగానే ఈ చిత్రానికి ఇంతటి క్రేజ్ ఏర్పడింది. ఈ మూడు మాత్రమే కాకుండా, స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ చిత్రానికి చాలా ఉపయోగపడింది. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మొదటిసారి ఈ సినిమాలో విలన్ క్యారక్టర్ చేసాడు. ఈ ఫ్యాక్టర్ కూడా మన తెలుగు వెర్షన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆ రేంజ్ లో జరగడానికి కారణం అయ్యింది. ఆయన క్యారక్టర్ ని ట్రైలర్ లో చాలా తక్కువ గా చూపించారని తెలుస్తుంది.
Also Read: ‘రాజాసాబ్’ నిర్మాతపై కేసు నమోదు..ఈ ఏడాది విడుదల అసాధ్యమే..అసలు ఏమైందంటే!
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడిన మాటలు చూస్తే రజినీకాంత్ క్యారక్టర్ కంటే తన క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉందని, నన్ను నేను మానిటర్ లో చూసుకొని ఇంత క్రూరంగా ఉంటారా మనుషులు బయట అని అనుకున్నానని నాగార్జున చెప్పుకొచ్చిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అంతే కాదు గత ఏడాది ప్రారంభం లో నాగార్జున కి సంబంధించిన ఒక షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. అందులో నాగార్జున అత్యంత క్రూరంగా కనిపిస్తాడు. వామ్మో ఈయనేంటి ఈ రేంజ్ లో ఉన్నాడు, రోలెక్స్ ని మించిపోయేట్టు ఉందిగా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ అప్పట్లో కామెంట్స్ చేశారు. ఇక రీసెంట్ వదిలిన కొన్ని బిట్ ప్రోమోలు చూస్తూ అందులో నాగార్జున డ్యాన్స్ వేయడం వంటివి మనం చూడొచ్చు.
Also Read: ప్రపంచ రికార్డు నెలకొల్పిన పవన్ కళ్యాణ్..ఇది ఎవరికీ సాధ్యం కాదు!
ఆ బిట్ ని చూస్తుంటే నాగార్జున క్యారక్టర్ కి ఒక సెపెరేట్ మ్యానరిజం, స్టైల్ కూడా లోకేష్ కనకరాజ్ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. రెగ్యులర్ విలన్ క్యారక్టర్ మాత్రం కాదు, నాగార్జున రేంజ్ ని పదింతలు పెద్దది చేసే క్యారక్టర్ అని అర్థం అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, నాగార్జున క్యారక్టర్ ఆడియన్స్ కి నచ్చితే కచ్చితంగా ఆయనకు నేటి తరం యూత్ ఆడియన్స్ లో క్రేజ్ పెరుగుతుంది. విక్రమ్ చిత్రం క్లైమాక్స్ లో సూర్య ని రోలెక్స్ క్యారక్టర్ లో ఎంత క్రూరంగా లోకేష్ కనకరాజ్ చూపించాడో మనమంతా చూశాము. గత పదేళ్లు గా సూర్య కి అద్భుతమైన క్యారక్టర్ ఏదైనా పడిందా అంటే ఆయన అభిమానులు గర్వంగా రోలెక్స్ క్యారక్టర్ గురించి చెప్పుకుంటారు. లోకేష్ కనకరాజ్ సినిమా విలన్ అంటే, కచ్చితంగా హీరో తో సమానమైన క్రేజ్ వస్తాది అనడానికి నిదర్శనం ఇదే, నాగార్జున కి కూడా అలాంటి పేరు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Nagarjuna dances for Arabic kuthu Song in #coolie #Anirudh #ThalapathyVijay pic.twitter.com/rbVv9ZKGiH
— ᴅʏɴᴀᴍᴏ (@jana_Nayagan07) August 11, 2025