Coolie Movie Twist : తమిళ్ సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే చాలు అందరికీ రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Hasan) గుర్తొస్తారు. వీళ్ళు గత 50 సంవత్సరాల నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ వస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణను సంపాదించుకున్నాయి. వీళ్ళు స్ట్రైట్ తెలుగు సినిమాలను కూడా చేసి మంచి విజయాలను అందుకున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. కమల్ హాసన్ లోకేష్ కనకరాజు(Lokesh Kanakaraj) దర్శకత్వంలో చేసిన విక్రమ్ (Vikram) సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి అతనికి మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టలేకపోయాయి. ఇక రజనీకాంత్ సైతం జైలర్ (Jailer) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి లాల్ సలామ్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. కూలీ (Cooli) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతుండటం విశేషం…ఈ సినిమాలో నాగార్జున ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరి ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది.
తద్వారా నాగార్జునకు ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనే విషయాల మీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ లో నాగార్జున బ్యాక్ షాట్ రిలీజ్ చేశారు. ఇక ఒక్క బ్యాక్ షాట్ తోనే నాగార్జున స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు. మరి అలాంటి నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
రజనీకాంత్ చేతుల్లో నాగార్జున చనిపోబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుంది? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరి నాగార్జున కనక ఈ సినిమాలో చనిపోతే అది రజనీకాంత్ చంపితే క్లైమాక్స్ లో చనిపోతాడా? లేదంటే ఇంటర్వెల్ లోనే చనిపోతాడా అనేది కూడా తెలుసుకోవడానికి ఆడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ సినిమా ఆగస్టు 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇక విషయం మీద క్లారిటీ రావాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే…