Coolie Collection Day 3: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) ఎలాంటి అంచనాల నడుమ విడుదలైందో మనమంతా చూశాము. తెలుగు లో ఈ చిత్రం ఒక డబ్బింగ్ సినిమా లాగా విడుదల అవ్వలేదు. ఒక స్టార్ హీరో సినిమా ఎలాంటి సందడి తో విడుదల అయ్యేదో, అలాంటి సందడి తోనే విడుదల అయ్యింది. ఫలితంగా ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. మొదటి రోజే అక్షారాలా 151 కోట్ల రూపాయిల గ్రాస్ అంటే మాటలు కాదు. నేటి తరం సూపర్ స్టార్స్ కి కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం లేదు, అలాంటిది రజినీకాంత్ 75 ఏళ్ళ వయస్సు లో కూడా అలాంటి వసూళ్లను రాబడుతూ, తనకు తానే సాటి, ఎవ్వరూ లేరు పోటీ అని అనిపించుకుంటున్నాడు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడు రోజుల్లో దాదాపుగా 326 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Also Read: ‘వార్ 2’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..హిందీ నే కాపాడుతుంది!
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఈ మూడు రోజులకు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ఏషియన్ సునీల్ 46 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. నేడు కూడా ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ మొదటి వారం లో అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి కానీ, రెండవ వారం లో మాత్రం కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ జైలర్ రేంజ్ లో థియేట్రికల్ షేర్ ని రాబట్టడం అసాధ్యం. జైలర్ చిత్రం తెలుగు వెర్షన్ లో దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ కూడా వేరే లెవెల్ లో ఉన్నింది.
ఇక ఇతర ప్రాంతాల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు లో మూడు రోజుల్లో 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నేడు కూడా ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన రెండు చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. రజినీకాంత్ గత చిత్రం వెట్టియాన్ క్లోజింగ్ లో కూడా తమిళనాడు లో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోలేదు. అలాంటిది ‘కూలీ’ చిత్రం కేవలం నాలుగు రోజుల్లో ఆ మార్కుని అందుకుందంటే ఈ సినిమా స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు, డివైడ్ టాక్ తోనే ఈ రేంజ్ లో ఉందంటే ఇక పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేది ఈ చిత్రం.