Coolie Movie Bookings: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మరిలాంటి సందర్భంలోనే తమిళ్ సినిమా హీరోలు సైతం ఎవరికి తీసి పోకుండా వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో తమిళ్ సినిమా హీరోలు కూడా వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14వ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాను చూడటానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా టికెట్లను గత కొద్దిసేపటి క్రితమే బుక్ మై షో లో పెట్టారు. ఇక ఈ సినిమా చూడడానికి ఒక్కసారిగా అందరూ బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపించడంతో బుక్ మై షో ఆప్ కొద్దిసేపు క్రాష్ అయినట్టుగా తెలుస్తోంది.
Also Read: ప్యారడైజ్ లో జడల్ క్యారెక్టర్ వెనక ఉన్న రహస్యం ఇదేనా..?
మరి ఏది ఏమైనా కూడా రజనీకాంత్ హవా అనేది ఏ రేంజ్ లో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ లో తెలుగులో ఈ సినిమాను చూసే వాళ్ళ సంఖ్య ఇలా ఉందంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాని వీక్షించే వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక మొత్తానికైతే 70 సంవత్సరాల వయసులో కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే కెపాసిటీ రజినీకాంత్ కి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మొత్తానికైతే ‘వార్ 2’ సినిమా టికెట్లను కూడా అని లైన్ లో అవలెబుల్ లో ఉంచారు. మరి ఇలాంటి సందర్భంలో రజనీకాంత్ కూలీ సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ బుక్ మై షో అప్ కాసేపు హ్యాంగ్ అయిందనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందని లోకేష్ కనకరాజు ఇంతకుముందు చెప్పిన మాటల్ని నిజం చేసే విధంగానే కనిపిస్తోంది. మరి ఈ సినిమా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందంటూ గతంలో లోకేష్ చేసిన వాక్యాలు ఈ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను చూస్తుంటే నిజమవుతాయనే అనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని కొల్లగొడుతొందనేది…