Coolie OTT Release: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది కానీ, చివరికి కమర్షియల్ ఫెయిల్యూర్ గానే నిల్చింది అనుకోవచ్చు. 15 రోజుల్లో 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే అది అసాధ్యం అని అనుకోవచ్చు. బుక్ మై షో 15 వ రోజున ఈ చిత్రానికి కేవలం 22 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు లో వసూళ్లు రావడం దాదాపుగా ఆగిపోయాయి. వచ్చే కలెక్షన్స్ మొత్తం ప్రస్తుతం హిందీ నుండే. హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించారు. భారీ లాభాలను తెచ్చిపెట్టిన ఏకైక ప్రాంతం నార్త్ ఇండియా అనడం లో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఈ వీకెండ్ లో ఎంత వసూళ్లు వస్తే అంత తీసుకెళ్లాల్సిందే. ఇక ఆ తర్వాత వసూళ్లను రాబట్టడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. మొత్తం మీద 530 నుండి 540 కోట్ల రూపాయిల గ్రాస్ మధ్యలో ఈ చిత్రం థియేట్రికల్ రన్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారం లో థియేట్రికల్ రన్ పూర్తిగా ఆగిపోయే అవకాశాలు ఉన్నందున, ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని సుమారుగా 120 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఈ చిత్రం సెప్టెంబర్ 12 న తెలుగు, తమిళం తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
త్వరలోనే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ దీనికి సంబందించిన అధికారిక ప్రకటన చేయనుంది. థియేటర్ లో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. చాలా సినిమాలు థియేటర్స్ లో మిశ్రమ స్పందన దక్కించుకొని, ఓటీటీ లో భారీ సక్సెస్ లు అందుకున్నాయి. కూలీ చిత్రం కూడా ఆ కోవకు చెందిన సినిమానే అవుతుందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. ఇకపోతే అక్కినేని నాగార్జున ఈ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి వారు ప్రత్యేక పాత్రల్లో తళుక్కుమని మెరిశారు. అయితే సినిమాలో ఏ క్యారక్టర్ కూడా సౌబిన్ సాహిర్ క్యారక్టర్ రేంజ్ లో డామినేట్ చేయలేకపోయాయని చెప్పొచ్చు.