Cooku With Jathirathnalu: స్టార్ మా ఛానల్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ ఛానల్ లో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ కి ఇంతమంచి రెస్పాన్స్ వస్తుందో, ఎంటర్టైన్మెంట్ షోస్ కి టీఆర్ఫీ రేటింగ్స్ అదే రేంజ్ లో వస్తున్నాయి. రీసెంట్ గానే ఈ ఛానల్ లో ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ అనే ప్రోగ్రాం మొదలైంది. గత ఏడాది ప్రసారమైన మొదటి సీజన్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము. ఆ సీజన్ పెద్ద హిట్ అవ్వడం తో రెండవ సీజన్ ని కూడా మొదలు పెట్టారు. వాస్తవానికి ఇదొక పాన్ ఇండియన్ షో. తమిళం , మలయాళం , కన్నడ మరియు హిందీ భాషల్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో తెలుగు లో కూడా ఈ షో ని మన ముందుకు తీసుకొచ్చారు.
ఇక పోతే గత సీజన్ లో కొనసాగిన జాతి రత్నాలు , ఈ సీజన్ లో కూడా కొనసాగుతున్నారు. ఒక్క విష్ణు ప్రియా, బిత్తిరి సత్తి మాత్రమే ఈ సీజన్ లో కనిపించడం లేదు. వాళ్ళ స్థానంలోకి కొత్తగా ఈ సీజన్ లో మణికంఠ, దీపికా రంగరాజు జాతి రత్నాలుగా ఎంటర్ అయ్యారు. ఇకపోతే గత సీజన్ లో కుక్ గా వ్యవహరించిన తనూజ, ఈ సీజన్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అదే విధంగా ‘బిగ్ బాస్ 9’ టైటిల్ విన్నర్ పవన్ కళ్యాణ్ పడాల కూడా ఈ సీజన్ లో పాల్గొంటున్నాడు. ‘బిగ్ బాస్ 9’ లో తనూజ, పవన్ కళ్యాణ్ జోడికి ఫ్యాన్ బేస్ మామూలు రేంజ్ లో లేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మొదటి ఎపిసోడ్ లో వీళ్లిద్దరి వంటకాలు జడ్జీలకు అంతగా నచ్చలేదు.
కళ్యాణ్ 5 వ స్థానం లో నిలిస్తే, తనూజ 4 వ స్థానం లో నిల్చింది. అదే విధంగా ఆదివారం ఎపిసోడ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ 5 వ స్థానం లో నిలవగా, పల్లవి గౌడ 4 వ స్థానం లో నిల్చింది. అయితే తదుపరి ఎపిసోడ్ లో వీళ్లందరిలో అందరికంటే తక్కువ మార్కులు శ్రీకాంత్ అయ్యంగార్ , పవన్ కళ్యాణ్ పడాలా కి వచ్చిందని , వీళ్లిద్దరి మధ్య కుక్ ఆఫ్ పోటీ జరుగుతుందని, ఈ పోటీలో శ్రీకాంత్ ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాల్సిందే.