https://oktelugu.com/

Sai Dharam Tej Srikalahasti: ఆలయంలో అపచారం… వివాదంలో సాయి ధరమ్ తేజ్!

సాయి ధరమ్ తేజ్ అనంతర కడప అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శించారు. సాయి ధరమ్ తేజ్ పుణ్యక్షేత్రాలను విజిట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్రో మూవీ మంచి విజయం సాధించాలని సాయి ధరమ్ తేజ్... ఆలయాలకు వెళ్లారు. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ సైతం నటించారు. ఆయన మోడ్రన్ గాడ్ రోల్ చేస్తున్నారు. బ్రో చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 15, 2023 / 10:20 AM IST

    Sai Dharam Tej Srikalahasti

    Follow us on

    Sai Dharam Tej Srikalahasti: హీరో సాయి ధరమ్ తేజ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆలయంలో అపచారం చేశాడంటూ కొందరు మండిపడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ బ్రో. జులై 28న విడుదల కానుంది. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తి వెళ్లారు. సుబ్రమణ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. గర్భగుడిలో సాయి ధరమ్ చర్యలు వివాదాస్పదం అయ్యాయి. సాయి ధరమ్ ఆలయంలోకి వెళ్లే సమయాన్ని అర్చకులు లేరు. దీంతో ఆయన స్వయంగా దేవుడికి హారతి ఇచ్చారు.

    దీన్ని హిందూ వర్గాలు తప్పుబడుతున్నాయి. గర్భగుడిలో అర్చకులు మాత్రమే దేవుడికి హారతి ఇవ్వాలి. సాయి ధరమ్ తేజ్ హారతి ఎలా ఇస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలియక చేసిన పనికి సాయి ధరమ్ తేజ్ విమర్శలపాలవుతున్నారు. అయితే ఈ విషయాన్ని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్ ఏమంత తప్పు చేయలేదని మద్దతుగా నిలుస్తున్నారు.

    సాయి ధరమ్ తేజ్ అనంతర కడప అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శించారు. సాయి ధరమ్ తేజ్ పుణ్యక్షేత్రాలను విజిట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్రో మూవీ మంచి విజయం సాధించాలని సాయి ధరమ్ తేజ్… ఆలయాలకు వెళ్లారు. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ సైతం నటించారు. ఆయన మోడ్రన్ గాడ్ రోల్ చేస్తున్నారు. బ్రో చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు.

    థమన్ సంగీతం అందించారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష భారీ హిట్ కొట్టింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. బ్రోతో ఆ విజయపరంపర కొనసాగించాలని కోరుకుంటున్నారు.