https://oktelugu.com/

బిగ్ బాస్4:  గంగవ్వపై కుట్రలు చేస్తున్నారా..?

ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్ల బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది. అదే ఊపుతో నాలుగో సీజన్‌ ప్రారంభించినా ఈసారి డీలా పడినట్లు కనిపిస్తోంది. బలమైన కంటెస్టెంట్లు లేకపోవడం.. మునుపటి స్థాయిలో ఎంటర్‌‌టైన్‌మెంట్‌ లేకపోవడం ప్రేక్షకులు పెద్దగా ఆదరణ చూపడం లేదు. దీన్ని గుర్తించిన బిగ్‌బాస్‌ ఇప్పుడిప్పుడే కొంత డోస్‌ పెంచుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం నాటి ఎపిసోడ్‌ చూస్తే అందరికీ అదే అర్థమైంది. Also Read: డబ్బింగ్ లో చైతు ‘లవ్ స్టోరీ’.. పోటీ ఎక్కువైంది ! అయితే.. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2020 / 02:18 PM IST

    gangavva in bigboss 4

    Follow us on


    ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్ల బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది. అదే ఊపుతో నాలుగో సీజన్‌ ప్రారంభించినా ఈసారి డీలా పడినట్లు కనిపిస్తోంది. బలమైన కంటెస్టెంట్లు లేకపోవడం.. మునుపటి స్థాయిలో ఎంటర్‌‌టైన్‌మెంట్‌ లేకపోవడం ప్రేక్షకులు పెద్దగా ఆదరణ చూపడం లేదు. దీన్ని గుర్తించిన బిగ్‌బాస్‌ ఇప్పుడిప్పుడే కొంత డోస్‌ పెంచుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం నాటి ఎపిసోడ్‌ చూస్తే అందరికీ అదే అర్థమైంది.

    Also Read: డబ్బింగ్ లో చైతు ‘లవ్ స్టోరీ’.. పోటీ ఎక్కువైంది !

    అయితే.. యూట్యూబ్‌ స్టార్‌‌ పేరొందిన గంగవ్వ ఈసారి బిగ్‌బిస్‌ సీజన్‌ 4 కు స్పెషల్‌ అట్రాక్షన్‌. సోషల్‌ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ షో కూడా చూడని ఆమె.. ఏకంగా బిగ్‌బిస్‌ హౌస్‌లోకి ఎంటర్‌‌ అయిపోయారు. తాజాగా గంగవ్వ పేరిట సైన్యం ఏర్పాటు కావడం.. గంగవ్వకే తమ ఓట్లు అంటూ పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు లభిస్తోంది.

    ఈ విషయాన్ని గ్రహించిన బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు గంగవ్వను టార్గెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే గంగవ్వ హౌస్‌లో ఉండలేకపోతోందన్నట్లు అనుకుంటున్నారు. పైకి అందరూ గంగవ్వతో బాగానే ఉన్నట్టు నటిస్తున్నప్పటికీ ఆమెను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు బయట ఫుల్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే మొదటి వారం నామినేట్‌ అయినా అధిక ఓట్లు సాధించి సేవ్‌ అయ్యారు. మొత్తం ఓట్లలో గంగవ్వకే 40 శాతం వస్తున్నాయంటే ఆమెకు ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఊహించుకోవచ్చు. మొన్నటి సీజన్‌ వరకు కూడా పల్లెటూర్లలో బిగ్‌బాస్‌ను అంతలా చూడని జనం.. ఇప్పుడు గంగవ్వ ఎంట్రీతో రోజూ చూస్తున్నారట. కానీ గంగవ్వ వెళ్లిపోతే బిగ్‌బాస్‌ టీఆర్పీ పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే బిగ్ బాస్ ఇప్పట్లో ఆమెను పంపేలా లేడని సమాచారం. కానీ.. హౌజ్‌మేట్స్‌ మాత్రం ఆమెను మెల్లమెల్లగా ఒంటరిని చేస్తే గతంలో సంపూర్ణేష్‌ బాబు వెళ్లిపోయినట్లు వెళ్తుందని కొందరు కుట్రలు చేస్తున్నారట.

    Also Read: శ్రావణి కేసు రిమాండ్ రిపోర్ట్: నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

    పక్కా విలేజ్‌.. కల్లాకపటం లేని నిర్మలమైన మనసు గంగవ్వది. మై విలేజ్‌ షోతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. మిగితా సభ్యుల్లా ఆమెకు నటించడం కూడా తెలియదు. అందరితోనూ సహజంగానే ఉండిపోవడం ఆమెకు అలవాటు. అక్కడ ఇమడ లేకపోతుండడంతోనే ఈసారి గంగవ్వ ఎలిమినేట్‌ ప్రక్రియలో తనకు తానే ముందుకు వచ్చినట్లుగా నెటిజన్లు అంటున్నారు. ‘నా వల్ల కాదు బిడ్డ నేను పోతా..’ అంటూ పలుమార్లు తన ఆలోచనను కూడా బయటపెట్టింది. మరి మున్ముందు గంగవ్వ హౌస్‌లో ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అదే స్థాయిలో ఫ్యాన్సుల్లో ఆందోళనా మొదలైంది.