Srikanth Odela And Nani: న్యాచురల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని… ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తున్నాయి. తద్వారా ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురు చూస్తుండటం విశేషం… ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పటికి ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి. దానివల్లే వీళ్లిద్దరూ సినిమా మీద అంత పెద్ద ఫోకస్ చేయడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నాని లాంటి హీరోకి దసర సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన శ్రీకాంత్ ఓదెల నానిని మరోసారి డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి అందులో భాగంగానే నాని సైతం కొన్ని విషయాల్లో అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాని మీదే ఇప్పుడు ఇద్దరి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ప్యారడైజ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా బాగా రావాలంటే వీరిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ ని పక్కన పెట్టి మరి సినిమాని బాగా తీయాల్సిన అవసరమైతే ఉంది… నిజంగానే వీళ్లిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తున్నాయా లేదంటే కావాలని ఎవరైనా ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ సూపర్ సక్సెస్ ని సాధిస్తే అటు నాని, ఇటు శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కూడా టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతారు. లేకపోతే మాత్రం ఇద్దరూ కూడా వాళ్ళ మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…
చూడాలి మరి ఈ సినిమాతో వాళ్లు భారీ విజయాన్ని సాధిస్తారా? లేదంటే డీలా పడిపోతారా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే శ్రీకాంత్ ఓదెల ఆ తర్వాత చిరంజీవితో చేయబోతున్న సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఏర్పడతాయి. లేకపోతే మాత్రం చిరంజీవితో సినిమా చేసే అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది…