Rajamouli Ignores Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా స్థాయి గుర్తింపును తెచ్చిన దర్శకుడు రాజమౌళి… తెలుగులో 100 కోట్ల కలెక్షన్స్ కూడా సరిగ్గా రాని సమయంలో 500 కోట్లతో బాహుబలి సినిమాను తెరకెక్కించి పెద్ద సాహసం చేశాడు. మొత్తానికైతే ఆయన అనుకున్నట్టుగా భారీ సక్సెస్ ని సాధించాడు. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో చాలా మంది దర్శకులు పాన్ ఇండియా లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ లను సాధించారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పటివరకు ఇవ్వకపోయిన కూడా నవంబర్ నెల నుంచి ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని ప్రేక్షకులతో పంచుకుంటానని చెప్పాడు. ఇక నవంబర్ 15వ తేదీన రామోజీ ఫిలిం సిటీ లో ఒక ఈవెంట్ ను కండక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ రోజే ఫ్యాన్స్ సమక్షంలో మహేష్ బాబు సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ని ఇస్తారట…
ఇక మహేష్ బాబు సంబంధించిన ఏ విషయం అయిన సరే రాజమౌళి మహేష్ తో కాకుండా తన భార్య అయిన నమ్రత తో డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ బాబుతో డిస్కస్ చేసిన కూడా దాన్ని ఫైనల్ చేసేది నమ్రత నే కాబట్టి డైరెక్ట్ గా తనతో డిస్కస్ చేసి సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
నిజానికి మహేష్ బాబు ఎలాంటి సినిమాలు చేయాలనేది కూడా నమ్రత నే డిసైడ్ చేస్తుంది. అప్పట్లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మహేష్ బాబు చేయాల్సిన సినిమాను మహేష్ ఓకే చేసినప్పటికి నమ్రత మాత్రం ఆ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే మహేష్ బాబు కి ఆ స్టోరీ సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో ఆ మూవీ ని క్యాన్సిల్ చేసిందట.
దాంతో సందీప్ వంగ రన్బీర్ కపూర్ తో ‘అనిమల్’ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే నమ్రత డైరెక్షన్లో నడుస్తున్న మహేష్ బాబు భారీ సక్సెస్ లను సాధిస్తూ బిజినెస్ లో కూడా భారీ లాభాలను అందుకుంటున్నాడు…