Mohan Babu The Paradise: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చి భారీ విజయాలను సాధించి స్టార్ హీరోగా ఎదిగిన వాళ్ళలో నాని ఒకరు…ప్రస్తుతం ఆయన మాస్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు… కెరీర్ మొదట్లో లవ్ స్టోరీ లను ఎక్కువగా చేసిన నాని ఇప్పుడు మాత్రం వరుసగా మాస్ సినిమాలను చేయడం వెనుక కారణం ఏంటి అంటే క్లాస్ సినిమా చేసినన్ని రోజులు మీడియం రేంజ్ హీరోలు గానే ఉంటారు. ఎప్పుడైతే మాస్ ఇమేజ్ ని సంపాదించుకుంటారో వాళ్లకు భారీ ఓపెనింగ్స్ దక్కుతాయి. అలాగే టైర్ వన్ హీరోగా మారే అవకాశాలు కూడా ఉంటాయనే ఉద్దేశ్యంతోనే నాని మాస్ జపం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దసర సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…ఇక ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా మోహన్ బాబుకు సంబంధించిన రెండు లుక్ లను రిలీజ్ చేశారు. అందులో ఆయన పెర్ఫెక్ట్ విలన్ గా సెట్ అయ్యాడు అంటూ చాలామంది విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…
ఈ సినిమాలో మోహన్ బాబు వైఫ్ గా రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ మూవీలో నానికి మోహన్ బాబు కి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి వీళ్లిద్దరి మధ్య గొడవలు రావడానికి గల కారణం ఏంటి? ఎవరి మీద ఎవరు పై చేయి సాధించారు అనే కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుందట. మొత్తానికైతే ఈ సినిమాను చాలా ప్రెస్టేజియస్ గా తెరికెక్కిస్తున్నారు.
ఇక వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తోంది అనేది తెలియాల్సి ఉంది. దసర సినిమాను మించి ఈ సినిమా ఉంటుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి… ఇక 2026 మార్చి 26 వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా అదేరోజు వస్తుందా? లేదంటే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దానిమీద సరైన క్లారిటి రావాల్సి ఉంది…